Jabardasth Sowmya Rao: ఒకప్పుడు హీరోయిన్స్ కు అస్సలు తెలివితేటలు ఉండేవి కావట. వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టాలి..ఎందులో పెడితే ఎక్కువ అవుతాయి. ఇలాంటివేమీ చూసుకునేవారు కాదట. కానీ, ఇప్పటి జనరేషన్ అలా కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుస్తున్నారు. అంటే అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకొని ఒక్కో ఇండస్ట్రీ ఉన్నచోట ఒక్కో ఇల్లు తీసేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఉంటే హైదరాబాద్.. బాలీవుడ్ అయితే ముంబై, కోలీవుడ్ అయితే చెన్నై.. కన్నడ అయితే బెంగుళూరు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతున్నవారందరికీ ఈ ఊర్లల్లో సొంత ఇళ్లు ఉన్నాయి. అయితే అందరి పరిస్థితిలు ఒకలా ఉండవు.
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారు.. ఎవరు ఎప్పుడు రోడ్డున పడతారు అని చెప్పడం చాలా కష్టం. సర్లే ఈరోజు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి కదా అని.. ఇక్కడే సెటిల్ అయ్యిపోయి ఇల్లు కొనేద్దాం అనుకుంటే అది పొరపాటు. అదే విషయాన్నీ హాట్ యాంకర్ సౌమ్యరావు చెప్పుకొచ్చింది. జబర్దస్త్ యాంకర్స్ అంటే టక్కున అనసూయ , రష్మీ అని చెప్పుకొస్తారు.
అనసూయ వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు.. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే బ్యూటీ ఎవరు.. ? అంతలా అందాల ఆరబోత చేసే భామ ఎవరు .. ? అని ప్రేక్షకులు మదనపడుతున్న సమయంలో కన్నడ నుంచి సౌమ్య రావు దిగింది. అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతుంటే.. పగలబడి నవ్వుకున్నారు. ఆమె చేసినవి కొన్ని ఎపిసోడ్స్ యే అయినా జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య మంచి గుర్తింపును తెచ్చుకుంది.
ఇక ఈ షో తరువాత ఈటీవీలో వచ్చే ప్రతి షోలో సౌమ్య కనిపిస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ చిన్నది ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని, తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంది. మంచిగా షోస్ చేస్తున్నారు.. తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు.. ఆదరిస్తున్నారు. షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సీక్వెల్స్ అంటే ఇవే..
హైదరాబాద్ లోనే ఒక ఇల్లు కొనుక్కోవచ్చు గా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సౌమ్య మాట్లాడుతూ.. ” అయ్యయ్యో ఈ ఇండస్ట్రీని నమ్ముకొని నేను షిఫ్ట్ అయితే ఇక అంతే. ఈ ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నవాళ్లు రేపు ఉండరు, రేపు ఉండేవాళ్ళు ఎల్లుండి ఉంటారని గ్యారెంటీ లేదు. ఇదేమి పర్మినెంట్ జాబ్ కాదు. ఎప్పుడు ఎవరి పొజిషన్ ఎలా ఉంటుందో.. ఏలా మారుతుందో ఎవరం చెప్పలేం..
ఇండస్ట్రీలో ఏమైనా అవ్వొచ్చు. దీన్ని నమ్ముకొని మనం వస్తే బాగుండదు. దేవుడి దయవల్ల అలాంటి ఒక రోజు వస్తే వంద శాతం ఇక్కడే ఉండటానికిప్రయత్నిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ ఆమె చెప్పినదాంట్లో కూడా నిజం లేకపోలేదు అని చెప్పుకొస్తున్నారు. మరి సౌమ్య ముందు ముందు హైదరాబాద్ లో ఇల్లు తీసుకుంటుందేమో చూడాలి.