BigTV English

Hyderabad Updates : డ్రగ్స్ కు అడ్డగా దుర్గం చెరువు .. వెలుగులోకి సంచలన విషయాలు..

Hyderabad Updates  : డ్రగ్స్ కు అడ్డగా దుర్గం చెరువు .. వెలుగులోకి సంచలన విషయాలు..
Hyderabad Updates


Hyderabad Updates : దుర్గం చెరువులో కొకైన్ ఆనవాళ్లపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు సంచలనం రేపుతున్నాయి. చెరువు నీటిలోని డ్రగ్స్ ఆనవాళ్లపై ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు ప్రసారం చేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుర్గం చెరువు డ్రగ్స్ ఇష్యూ హాట్ టాపిక్‌ గా మారింది. చాలామంది సామాజికవేత్తలు, ఐటీ నిపుణులు దుర్గం చెరువులో డ్రగ్స్ ఆనవాళ్లపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

దుర్గం చెరువులోని నీటి శాంపిల్స్‌ పరిశీలనలో భయానక వాస్తవాలు బయటపడ్డాయి. ఏకంగా కొకైన్‌ ఆనవాళ్లు లభించడం హైదరాబాదీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. డ్రగ్స్‌ వాడకం ఏ స్థాయిలో ఉందనే సంకేతాలు కనిపించడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.


హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ ప్రాంతం లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్‌ అడ్రస్. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ఇలా మొత్తం పబ్‌లు, హైఫై లైఫ్‌కు సెంటర్‌. దుర్గం చెరువు నీటి పరిశీలనలో బయటపడ్డ వాస్తవాలు నగరంలోని చీకటి కోణాలను కళ్లకు కడుతున్నాయి. విచ్చలవిడిగా డ్రగ్స్‌ వాడుతుంటడం సంచలనం రేపుతోంది. ఏకంగా కొకైన్‌ ఆనవాళ్లతోపాటు డిప్రెషన్‌ తగ్గడానికి వాడే మందుల శాంపిల్స్‌ బయటపడటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

దుర్గం చెరువు కలుషితమవుతున్న తీరుపై ఐఐటీ హైదరాబాద్‌, మహింద్రా యూనివర్సిటీ విద్యార్థులు పరిశోధన చేశారు. చెరువులో మూడు చోట్ల శాంపిల్స్‌ సేకరించారు. ఆ రిపోర్ట్‌లో భయానక నిజాలు వెలుగు చూశాయి. దుర్గం చెరువులో కొకైన్ ఆనవాళ్లు ఉన్నాయని లేక్‌రిపోర్ట్‌ బయటపెట్టింది. పైకి రంగుల ప్రపంచంలా కనిపిస్తున్న హైటెక్‌ సిటీలో అసలు ఏం జరుగుతోందనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న సైబర్‌ సిటీలో చీకటి కోణం దాగుందనే చేదు నిజం నగరవాసులకు మింగుడు పడకుండా చేస్తోంది. దుర్గం చెరువు హైటెక్‌ సిటీ పరిధిలో ఉంది. ఇక్కడంతా హైఫై పీపుల్‌ ఉంటారు. ఐటీ ఉద్యోగులకు మెయిన్‌ అడ్డా. దేశ విదేశాల నుంచి ఇక్కడ ఐటీ విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి ప్లేస్‌లోని ప్రశాంతమైన లేక్‌లో కొకైన్‌ ఆనవాళ్లు బయటపడం డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది.

దుర్గం చెరువు నీటి పరిశోధన నివేదికలో మూత్రం ఆనవాళ్లలో కొకైన్‌-డీ3 శాంపిల్స్‌ ఉన్నాయని నిర్ధరించారు. అయితే ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ దుర్గం చెరువు చుట్టు ఉన్న పబ్‌లలోనే తీసుకుంటున్నారా.? ఈ స్థాయిలో డ్రగ్స్‌కు బానిసలు కావడం వెనక కారణాలు ఏంటి..? నగరం నడిబొడ్డున డ్రగ్స్ వినియోగం ఈ స్థాయిలో జరుగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు..? అనే అంశాలు తేలాల్సి ఉంది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×