HYDRA: తెలంగాణలో సరిగ్గా ఏడాది క్రితం రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చారు. హైడ్రా (HYDRA- Hyderabad Disaster Response and Asset Protection Agency) విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో గొప్ప పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్‌లో వరదలు, అగ్నిప్రమాదాల వంటి సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ప్రజల భద్రతను కాపాడుతుంది. అత్యాధునిక సాంకేతికత, శిక్షణ పొందిన సిబ్బందిని కలిగి ఉండి నగరంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందిస్తుంది. హైడ్రా నగర ఆస్తులను సంరక్షిస్తూ, ప్రజలకు భరోసా కల్పిస్తుంది. సమన్వయం, సమర్థతతో హైడ్రా తెలంగాణలో ఒక ఆదర్శవంతమైన వ్యవస్థగా నిలుస్తోంది. హైడ్రా ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.
పేదల జోలికి హైడ్రా వెళ్లదు…
హైడ్రా ఏర్పడిన మొదటి సంవత్సరం లో అనేక విజయాలను, సవాళ్లు ఎదుర్కొందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా హైడ్రా లక్ష్యం వైపు ముందుకు వెళుతుందని చెప్పారు. ప్రజలు భాగస్వాములై గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులను కాపాడాలని పేర్కొన్నారు. ‘జీవం పోసుకున్న బతుకమ్మ కుంట చెరువులో ఈ సారి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తాం. పేద.. మధ్యతరగతి నివాసాల ప్రజల జోలికి హైడ్రా వెళ్లదు. ఓవైసీ కాలేజీల విషయంలో హైడ్రా దాత్రుత్వంతో ఆలోచించింది. హైడ్రా ప్రజలకు ఎఫ్డీఎల్.. బఫర్ జోన్ పై అవగాహన కల్పించాం. ఇప్పటి వరకు 500 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం. రోడ్లు.. నాళాలు.. పార్కుల.. ఆక్రమణలను తొలగించాం. 20 చెరువులకు పైగా హైడ్రా కాపాడింది. వాటిని హైడ్రా అభివృద్ధి చేస్తుంది. ఈ డిసెంబర్ వరకు మరికొన్ని చెరువులను నగరంలో అభివృద్ధి చేస్తున్నాం. బతుకమ్మ కుంట పునరుజీవం కల్పించడం ఆనందంగా అనిపించింది’ అని ఆయన చెప్పారు.
ఈసారి బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబరాలు…
హైదరాబాదులోని అన్ని చెరువుల ఎఫ్ టీఎల్ నిర్ధారించిన అనంతరం వాటన్నీటికి ఆక్రమణ తొలగించి అభివృద్ధి చేయబోతున్నాం. పేద.. మధ్యతరగతి నివాసాల ప్రజల జోలికి హైడ్రా వెళ్లదు. చెరువులను ఆక్రమించి.. వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. బతుకమ్మ కుంటలో ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున చేయబోతున్నాం. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైడ్రా ముందుకు వెళుతుంది. మాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు. అనేక సవాళ్లను అయితే ఎదుర్కొన్నాం. మాకు సంబంధం లేని అంశాలపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారు. ఈ సంవత్సరంలో అనేకమంది హైడ్రాను బదనాం చేయాలని చూశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా హైడ్రా లక్ష్యం వైపు ముందుకు వెళుతుంది. ఓవైసీ కాలేజీల విషయంలో హైడ్రా పేద విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో ముందుకు వెళుతుంది FTL డిక్లేర్ కాకముందు ఫాతిమా కాలేజ్ నిర్మాణం జరిగింది.. దాతృత్వంతో హైడ్రా ఆలోచిస్తుంది’ రంగనాథ్ వ్యాఖ్యానించారు.
జనతా గ్యారేజ్ పాటను గుర్తుచేసిన రంగనాథ్
ఎవడికి సొంతం ఇదంతా.. ఎవడు నాటిన మొక్క.. జనతా గ్యారేజ్ ప్రణామం ప్రణామం పాటను రంగనాథ్ గుర్తుచేశారు. మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపిస్తుంది హైడ్రా.. ప్యాట్నీ నాలా ఆక్రమణల ద్వారా 30 వేల మంది వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్యాట్ని కుటుంబీకులు ఆ నాలా విషయంలో అడ్డుపడుతున్నారు . నిన్న వరదల్లో ఇంకా భయానకమైన పరిస్థితి ఎదురయ్యేది. కొంతమంది స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాలనీవాసులు ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు.. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. చెరువులు ప్రజల ఆస్తులు ప్రజలు భాగస్వాములై చెరువులని కాపాడాలి. హైడ్రా వారికి సహాయకరంగా సపోర్టింగ్ గా ఉంటుంది.. చెరువులను కాపాడుకుంటే ప్రజలు, హైదరాబాద్ భవిష్యత్తు బాగుంటుంది. చెరువుల అభివృద్ధిలో ప్రజల సహకారాన్ని తీసుకుంటూ హైడ్రా ముందుకు వెళుతుంది’ అని రంగనాథ్ చెప్పారు.
ALSO READ: Intelligence Bureau: సూపర్ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..