Hydra Issues Notice: హైడ్రా స్పీడ్ తగ్గిందా? లేక తెర వెనుక పని చేసుకుంటూ పోతోందా? రెండు వారాలుగా హైదరాబాద్‌లో హైడ్రా ఎందుకు సైలెంట్ అయ్యింది? నగరంలో అక్రమ కట్టడాల మాటేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది హైడ్రా వ్యవస్థ. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతో వచ్చింది. మొదట్లో యమ దూకుడు ప్రదర్శించింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా సైలెంట్ అయిపోయింది. ఇందుకు కారణమేంటి?
హైడ్రా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఇప్పటివరకు కూల్చిన వ్యర్థాలను తొలగించిన నిర్మాణదారుణలకు నోటీసులు ఇచ్చింది. రెండు నెలల కిందట అంటే ఆగస్టు 14న నిజాంపేట్ ఎర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాలను మూడింటిని నేల కూల్చింది. హైడ్రా తన పని తాను చేసుకుపోయింది.
వ్యర్థాల్లో ఉన్న ఐరన్‌ను తీసుకెళ్లారు. వ్యర్థాలను అక్కడే వదిలేసి సైలెంట్ అయ్యారు నిర్మాణదారులైన బిల్డర్లు. ఈ వ్యవహారంపై హైడ్రా దృష్టి పెట్టింది. కూల్చిన వ్యర్థాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తోంది హైడ్రా. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: గులాబీ రంగులో మెరిసిన.. కాచిగూడ రైల్వేస్టేషన్.. కారణం మీరనుకున్నది కాదు కానీ..?
మరోవైపు నాలాలపై హైడ్రా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా సిటీలో వర్షం పడినప్పుడు పలు ప్రాంతాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాలను పరిశీలించారు.. వాటిలో చాలా వరకు చెత్త చెదారంతో మూసుకుపోయాయి. దానిపై అక్రమ షాపులు వెలిశాయి.
అలాగే ట్రాఫిక్ జామ్ అవుతున్న ఏరియాల్లో ఫుట్‌పాత్‌లపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించి, అక్రమ కట్టడాలు అడ్డుకోగలిగితే ఎలాంటి వరదలు వచ్చినా కొంతలో కొంత హైదరాబాద్ సేఫ్ అవుతుందని అంటున్నారు సామాన్యులు.