BigTV English

Devara: ఒక మంచి సినిమా తీయడమే కాదు కరెక్ట్ టైం కి రిలీజ్ చేయడం కూడా అవసరం

Devara: ఒక మంచి సినిమా తీయడమే కాదు కరెక్ట్ టైం కి రిలీజ్ చేయడం కూడా అవసరం

Devara: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రచయితగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలకు రాసి, మిర్చి సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. బాహుబలి సినిమాకి ముందు రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రభాస్ కటౌట్ ను 100% పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు కొరటాల శివ అని మంచి ప్రశంసలు కూడా పొందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ చేసిన సినిమా శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ అయిపోయాడు కొరటాల. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టాడు. వరుస నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసినా కూడా ఒక డిజాస్టర్ సినిమా కొరటాల ఇమేజ్ ని డామేజ్ చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా మిగిలింది.


రీసెంట్ గా కొరటాల దర్శకత్వం వహించిన సినిమా దేవర. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మొదట నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ వసూలు చేసి హిట్ లిస్ట్ లో చేరిపోయింది. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా సెప్టెంబర్ 27న వస్తుందని అనౌన్స్ చేయడంతో, దేవర సినిమాను అక్టోబర్ 10 ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఓ జి సినిమా పోస్ట్ పోన్ కావడంతో, అదే డేట్ కి దేవర సినిమాను ప్రీ పోన్ చేశారు. అయితే ఈ సినిమాకి ఇది చాలా ప్లస్ అయింది అని చెప్పాలి ఆ టైంలో సరైన సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. అలానే దసరా ఫెస్టివల్ కూడా దేవర సినిమాకు బాగానే కలిసి వచ్చింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కల్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ఫెస్టివల్ ని మిస్ చేసుకుని ప్రస్తుతం దీపావళికి రానున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత వెంకీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అలానే రెండు వరుస హిట్ సినిమాలు తర్వాత దుల్కర్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా ఇంప్రెస్సివ్ గా అనిపించింది. ఈ రెండు సినిమాలుకు కూడా రిలీజ్ టైం బాగా కలిసి వచ్చింది. దీనిని బట్టి ఒక మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో సరైన టైంలో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×