HYDRAA: హైదరాబాద్‌లో కబ్జాదారుల పీడకల ‘హైడ్రా’ మరోసారి విరుచుకుపడింది. మియాపూర్ వేదికగా భారీ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా అధికారులు.. సుమారు 3 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించారు.
మియాపూర్ మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబర్ 44లో ఈ భారీ ఆపరేషన్ కొనసాగింది. గతంలో ప్రజావాణికి అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించి సుమారు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రను హైడ్రా భగ్నం చేసింది. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు పడగా.. తాజాగా 15 ఎకరాల భూమిని హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంది.
గతంలోనే ఇదే ప్రాంతంలో 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. తాజాగా మరో 15 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 159 పత్రాలతో సర్వే నంబర్ 44లోని భూమిని కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. చెరువు కట్టలపై వెలిసిన అక్రమ షెట్టర్లను సైతం నేలమట్టం చేసి.. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా రాజీపడబోదని మరోసారి నిరూపించింది.
ALSO READ: గాలిపటం ఎగరవేస్తుండగా కరెంట్ షాక్.. ఐదేళ్ల బాలుడు మృతి
మియాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్
రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలో ఆక్రమణలను తొలగింపు
సర్వే నంబర్ 44లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికారులు
స్వాధీనం… pic.twitter.com/pQBOLYG5EI
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2026