BigTV English

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Jaggareddy Comments: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించడం సంతోషకరం. సోనియాగాంధీ నాయకత్వం..రాహూల్ గాంధీ, ఖర్గే సారథ్యంలో మహేష్ గౌడ్ ను పీసీసీ చీఫ్ ను చేసింది పార్టీ. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం మంచి పరిణామం. అయితే, ఈ పదవి కోసం బీసీ కులానికి చెందిన మహేష్ గౌడ్, మధు యాష్కీ గౌడ్ పేర్లను పరిశీలించారు. ఎస్సీ నుంచి సంపత్ పేరు కూడా చర్చకు వచ్చింది. ఎస్టీ నుంచి బలరాం నాయక్ పేరు పరిశీలన చేశారు.


సీఎంగా రేవంత్.. రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఎన్ఎస్ యూఐ నుంచి పార్టీ కోసం పనిచేసిన బీసీ నేతకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చింది ఏఐసీసీ. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల అభిప్రాయం కూడా తీసుకున్నదని ఏఐసీసీ. సోనియా గాంధీ, రాహూల్ గాంధీ, సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ ల సహకారంతో మహేష్ గౌడ్ ను కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీఎం.. సీనియర్ మంత్రులు… పీసీసీ కలిసి సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్తారు.

Also Read: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్


సీఎం రేవంత్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవిని చేపట్టి మూడేళ్లు పూర్తి అయ్యిందని.. కొత్త చీఫ్ ను నియమించండంటూ ఆయన కోరారు. జగ్గారెడ్డికి కూడా పీసీసీ కావాలనే ఆలోచన మారదు. స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ లోనే ఉంటుంది. ఏఐసీసీ రెడ్డిలకు పీసీసీ ఇప్పుడు ఇవ్వొద్దని అనుకున్నది… అందుకే బీసీకి ఇచ్చారు. రెడ్డిలకు ఇవ్వాలని అనుకుంటే జగ్గారెడ్డి చర్చలోకి వస్తాడు. కాంగ్రెస్ లో చాలా సంతోషంగా ఉన్నాను నేను. నాకు ఏ పోస్ట్ వస్తుంది అనేది నేను చర్చ చేయను.. ఇవాళ వినాయక చవితి. మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పీసీసీ పదవి ఇచ్చింది అంటే కాంగ్రెస్ గొప్పతనం అది. కాంగ్రెస్ లో కష్టపడిన వారికి అవకాశాలు ఉంటాయి అని మహేష్ గౌడ్ నియామకమే నిదర్శనం.

కాంగ్రెస్‌లో కష్టపడినవారికి అవకాశాలు ఉంటాయి అనేదానికి మహేష్ గౌడ్ నియామకమే నిదర్శనం. రెడ్డి సీఎం.. ఎస్సీ డిప్యూటీ సీఎం.. పీసీసీ చీఫ్ బీసీ. మూడు ప్రధాన పదవుల్లో మూడు కులాలు. ప్రాంతీయ పార్టీలతో అలాంటి అవకాశమే ఉండదు. బీజేపీలో ప్రెసిడెంట్ అవ్వాలంటే కుదరదు. అసలు బీజేపీలో ఎప్పుడు పదవి వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రాంతీయ పార్టీలో వేరే వాళ్లకు అవకాశమే లేదు. ఐతే తండ్రి..లేకుంటే కొడుకే అధ్యక్షుడు అవుతారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం. కమ్మ సామాజిక వర్గంలో జెట్టి కుసుమ కుమార్ కి పదవి ఇవ్వాలి. ఆ బాధ్యత సీఎం రేవంత్ దే.

Also Read: ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ

స్వాతంత్రం వచ్చిన తరువాత నెహ్రూని ప్రధాని చేశారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కులాలు అభివృద్ధి చెందేలా నెహ్రూ, ఇందిరాగాంధీలు ప్రోత్సహించారు. అంబేద్కర్ కు రాజ్యాంగం రాసే బాధ్యతను ఇచ్చారు. కుల వృతులను గుర్తించింది కాంగ్రెస్సే. బీసీ, దాని ఉపకులాలను కూడా అభివృద్ధి చేయాలని రాజ్యాంగంలో పొందుపరిచింది కాంగ్రెస్సే. వెనకబడిన కులాల అభివృద్ధికి విత్తనం నాటిందే..నెహ్రూ.
మా తర్వాత ఎన్టీఆర్ బీసీల కోసం పని చేశారు’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×