Hydra: రాష్ట్రంలో చెరువులను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చెరువును ఆక్రమించి ఇల్లు కట్టినా నోటీసులు ఇచ్చి అధికారులు కూల్చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా చెరువుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇక తాజాగా మైడ్రా మరో చెరువును కాపాడింది. నగరంలోని కొన్ని చెరువుల్లో కన్ స్ట్రక్షన్ కంపెనీలు మట్టితోడి పోస్తున్నాయి. దీంతో ఆ చెరువుల్లో పూడిక ఏర్పడి నీరు నిల్వకుండా పోతున్నాయి.
Also read: పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్.. ప్రధాని మోడీతో సుధీర్ఘ భేటీ.. చర్చ సాగింది అందుకేనా?
తాజాగా నగరంలోని ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువులో సంధ్యా కనస్ట్రక్షన్ కంపెనీ మట్టి పోస్తోంది. నిర్మాణాల సమయంలో తోడిన మట్టిని అంతా చెరువులో పోయడంతో అది పూర్తిగా నిండిపోతుంది. దీంతో భగీరథమ్మ చెరువుపై హైడ్రా నిఘా పెట్టింది. ఈ నెల 26న తెల్లవారుజామున 3 గంటలకు టిప్పర్లతో భగీరథమ్మ చెరువులో మట్టిపొస్తున్న దృశ్యాలను హైడ్రాకు చెందిన డీ ఆర్ ఎఫ్ బృందాలు కనుగొన్నాయి. ఈ సమాచారాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులకు చేరవేశాయి. జేసీబీ (వెహికల్ నంబర్ టీఎస్ 27C3482)తో చెరువులో మట్టి పోస్తున్నట్టు పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాయి. జేసీబీ ఓనర్ దున్నపోతు సురేష్ పై, ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ రాయదుర్గంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
జేసీబీతో పాటూ మట్టిని తరలించింది సంధ్య కన్ స్ట్రక్షన్ కంపెనీ వారేనని గుర్తించారు. రాయదుర్గం పోలీసులు సంధ్య కన్ స్ట్రక్షన్ యజమాని శ్రీధర్ రావుతో పాటూ వెంకటేశ్వర రావు, సుంకరవీర వెంకట సత్యనారాయణమూర్తి, మణికంఠ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువులలో అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే బయపడిపోతుండగా తాజాగా భగీరతమ్మ చెరువులో జరుగుతున్న వ్యవహారంపై నిఘాపెట్టి కేసు నమోదు చేయడంతో చెరువుల జోలికి వెళ్లాలంటేనే బయపడే అవకాశం ఉంది.