BigTV English

Intinti Ramayanam Today Episode :  పల్లవి ప్లాన్ లో మరోసారి బుక్కయిన అవని.. తృటిలో తప్పిన ప్రమాదం..

Intinti Ramayanam Today Episode :  పల్లవి ప్లాన్ లో మరోసారి బుక్కయిన అవని.. తృటిలో తప్పిన ప్రమాదం..

Intinti Ramayanam Today Episode November 28th:  నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్  జేమ్స్ బాండ్ గెటప్ లో కిందకు వస్తాడు. భామ్మని పిలుస్తాడు. నేను ఎలా ఉన్నాను అచ్చం జేమ్స్ బాండ్ లాగా ఉన్నాను కదా చెప్పవే ముసలి అని అడుగుతాడు. ఇక ఈ గెటప్ లో ఉన్న నాకు ఫోటోలు తీయమని బామ్మను అడుగుతాడు. దానికి బామ్మ  ఫోటోలు తీస్తుంది. ఎన్ని ఫోటోలు తీసాను. ఇక నావల్ల కాదు నేను తీయలేను అని అంటుంది. అప్పుడే ఇంటికి వస్తాడు. చక్రధర్ కు చెమటలు పట్టిస్తాడు అల్లుడు. మావయ్యను పట్టుకొని ఏంట్రా మాటలని అరుస్తారు. పార్వతి, రాజేంద్ర ప్రసాద్ అరుస్తారు. ఆ గెటప్ ని వెళ్లి వెంటనే మార్చుకోమని చెప్తారు. ఇక కమల్ లోపలికి వెళ్ళిపోతాడు. పల్లవితో మాట్లాడాలని చక్రధర అనగానే  ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పల్లవి వాళ్ళ డాడీని తీసుకొని గార్డెన్ లోకి వెళ్తుంది. జరిగిన నిజం చెప్పి ఫుల్ ఖుషి అవుతుంది. అవని తనను కింద పడాలని నూనె పోసిందని బామ్మ అవనిని దారుణంగా అవమానిస్తుంది. అక్షయ్ మాత్రం మాట్లాడడు.. అవని బాధ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే అవని అందరికి కాఫీ ఇవ్వాలని ప్రిపేర్ చేస్తుంది. పార్వతి వచ్చి నాకు వద్దమ్మా అందరికి ఇవ్వు నాకు ఇప్పుడు వద్దని చెప్పి వెళ్తుంది. ఇక అందరికీ కాఫీ ఇస్తుంది. కమల్ ఇది కాఫీ కాదు నా అమృతం నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని ప్రశంసలు కురిపిస్తాడు. ఇక అక్షయ్ కాఫీ తీసుకోడు. ఈ విషయం మామయ్యకు తెలిస్తే బాగోదు మీరు తీసుకోండి అనేసి అంటుంది. అందరికీ కాఫీ ఇచ్చిన తర్వాత పార్వతి అవని దగ్గరకు వస్తుంది. కుంకుమపువ్వు కలిపిన పాలని పల్లవికి ఇవ్వు అని చెప్తుంది. పల్లవి దగ్గరికి పాలు తీసుకుని అవని వెళ్తుంది. పల్లవి ఇవాళ డాడీ తో ఫోన్ మాట్లాడుతుంది. కడుపు మోయడం ఇష్టం లేదు డాడ్ నాకు అర్జెంటుగా అబార్షన్ అవ్వడానికి టాబ్లెట్స్ పంపించు అనేసి అంటుంది. ఆ మాటలు అవనీ వింటుంది. ఏంటమ్మా పాలు మళ్ళీ తీసుకొచ్చావా నీ పార్వతి అంటే అవని బాత్రూంలో స్నానం చేస్తున్నట్టుంది అత్తయ్య అనేసి అంటుంది.

ఇక అందరూ ఆఫీస్ కి వెళ్తున్నామని పార్వతీతో చెప్పి వెళ్తారు. అక్షయ్ తను చెప్పకుండా వెళ్లడంతో అవని ఫీల్ అవుతుంది. ఇక డెలివరీ బాయ్ మందులు ఇస్తాడని వాళ్ళ డాడీ తో మాట్లాడింది కదా ఆ మందుల్ని ఎలాగైనా మార్చేసి అబార్షన్ ఇవ్వకుండా చూడాలని అవని అనుకుంటుంది. డెలివరీ బాయ్ టాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. అవని నేనే పల్లవిని ఆ టాబ్లెట్స్ ని తీసుకుంటుంది. ఈ టాబ్లెట్స్ ఏంటో ముందు మెడికల్ షాప్ లో కనుక్కోవాలని టాబ్లెట్స్ ని తీసుకొని వెళ్తుంది. మెడికల్ షాప్ అతన్ని అడిగి ఇవి అబార్షన్ టాబ్లెట్స్ అని తెలుసుకుంటుంది. వీటికి బదులుగా విటమిన్స్ టాబ్లెట్స్ ఇవ్వండి అనేసి అడుగుతుంది. ఇక టాబ్లెట్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. పల్లవి ఎవరో డెలివరీ బాయ్ టాబ్లెట్స్ ఇచ్చారని ఇస్తుంది. ఇవేం టాబ్లెట్స్ పల్లవి అని అడుగుతుంది అవని. పల్లవి ఇది వేసుకుంటే బాబు హెల్దీగా పుడతారని డాక్టర్ చెప్తే డాడీ పంపించారు అక్క అనేసి అంటుంది.


పాలు తీసుకొచ్చి ఇస్తావా అక్క నీ పల్లవి అనగానే అవని పాలు తెచ్చిస్తుంది. నేను అనుకున్నట్టు నీ చేతితోనే టాబ్లెట్ తీసుకొని అబార్షన్ అయ్యేలా చేసుకుంటున్నా అనేసి పల్లవి అనుకుంటుంది. దృష్టిలో ఇవి విటమిన్స్ టాబ్లెట్స్ కానీ మార్చినట్టు నీకు తెలియదు కదా అని అనుకుంటుంది. అవని అలా లోపలికి వెళ్ళగానే పల్లవి కడుపులో నొప్పిని అరుస్తుంది. వీళ్ళందరూ ఆఫీస్ కి వెళ్ళారు కదా మనం హాస్పిటల్ కి తీసుకెళదామని పార్వతి అంటుంది. ఇక అక్షయ్ కమల్, రాజేంద్ర ప్రసాద్ లు ఆఫీస్ నుంచి హాస్పిటల్ కి వస్తారు. పాలు తాగి టాబ్లెట్ ఏసుకుంది రెండు నిమిషాలకే కడుపున పని అల్లాడిపోయింది అనేసి పార్వతి అంటుంది. డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏమైందో తెలుస్తుంది అనేసి అంటారు. పల్లవి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పాము వాళ్ళు కూడా వస్తున్నారని అవని అంటుంది. నాకెందుకు ఈ చిన్న విషయం గురించి చెప్పి టెన్షన్ పెట్టడం అనగానే పార్వతి తన కూతురు గురించి చెప్పకుండా అంటే ఏదైనా అవుతుందని వాళ్లకి టెన్షన్ ఉంటుంది కదా అని అంటుంది. అంతలోకే చక్రధర్, రాజేశ్వరిలు వస్తారు.

అప్పుడే డాక్టర్ బయటికి వస్తుంది. ఏమైంది డాక్టర్ ఎందుకు కడుపునొప్పి వచ్చింది అని అంటే? అసలు ఆమె ఏం చేసింది ఏం తిన్నది అని డాక్టర్ అడుగుతుంది. పాలు తాగి టాబ్లెట్ వేసుకునింది అని చెప్తారు. ఆ టాబ్లెట్స్ ఎపిస్తారు అంటే అప్పుడు బామ్మా టాబ్లెట్ ఇస్తుంది. ఇవి అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ అని డాక్టర్ చెప్తుంది. ఆమె టాబ్లెట్ వేసుకునేటప్పుడు మీరు చూసుకోవాలని తెలియదా అనేసి డాక్టర్ అంటుంది. టాబ్లెట్ వేసుకున్న కొద్దిసేపటికి మీరు హాస్పిటల్ కి తీసుకొచ్చారు కాబట్టి ఆమెకు అబార్షన్ అవ్వకుండా చూసుకున్నాం. ఇకమీదట మీరు జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ చెప్తుంది. అందరూ పల్లవి చూడ్డానికి లోపలికి వెళ్తారు. అసలేమైంది ఇప్పుడు ఎలా ఉందని పల్లవిని అడుగుతారు. తో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో అవనీ టాబ్లెట్ ఇచ్చిందని చెప్తుంది. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×