Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పటికే ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు బయల్దేరారు. తన దగ్గరున్న ఆధారాలన్నింటిని అధికారులకు సమర్పిస్తానన్నారు బండి సంజయ్. తనకు సిట్ విచారణపై నమ్మకం లేదని.. కానీ తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానని తెలిపారు. ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు
గత ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్‌నే ఎక్కువ సార్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా బండి ఫోన్ కాల్స్ టాప్ చేసినట్లు తెలిపారు. మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయట పెట్టింది కూడా నేనే అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు, ఇలా కేసిఆర్ గారి ప్రభుత్వం అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయని తెలిపారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు.. సిట్ మీద కూడా నమ్మకం లేదన్నారు. అధికారులు మంచివాళ్లే గాని అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీగా వర్క్ చేసుకోనివట్లేదన్నారు. కమిషన్‌ల పేరుతో కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట చేయలేదని మండిపడ్డారు.
Also Read: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు కేంద్రమంత్రి బండి సంజయ్ ముందుంచాయి. ఈ మేరకు నిన్న హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై వారితో బండి సంజయ్ చర్చించారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది. SIB, సిట్, ఇంటెలిజెన్స్ అధికారులతో బండి సంజయ్ ప్రత్యేకంగా చర్చించారు.
మరికాసేపట్లో SIT ముందుకు కేంద్రమంత్రి బండి సంజయ్
గత నెల 24న విచారణకు హాజరుకావాలని బండి సంజయ్‌కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా హాజరుకాలేనని తెలిపారు. కాగా మరోసారి ఈ నెల 8న హాజరు కావాలని అధికారులు సూచించడంతో నేడు ఆయన సిట్ ముందుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు. తన వద్ద ఉన్న అన్ని రకాల ఆధారాలను సిట్‌కు అందజేస్తారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అందరి కంటే ముందు బయటపెట్టిందే నేను : బండి సంజయ్
నా ఫోనే ఎక్కువ సార్లు ట్యాప్ చేశారు
కేవలం నాదే కాదు నా కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసే సిబ్బంది, నా అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు
ఇవాళ విచారణకు హాజరై నా దగ్గర ఉన్న సమాచారాన్ని అధికారులకు ఇస్తాను… pic.twitter.com/YZmrVL0Rii
— BIG TV Breaking News (@bigtvtelugu) August 8, 2025