BigTV English

Ranbeer Kapoor: ఆ హీరోయిన్లతో యానిమల్ లా బిహేవ్ చేశా: రణ్ బీర్ కపూర్

Ranbeer Kapoor: ఆ హీరోయిన్లతో యానిమల్ లా బిహేవ్ చేశా: రణ్ బీర్ కపూర్

Bollywood Actor Ranbir kapoor realised about dating with Heroines


బాలీవుడ్ ఇండస్ట్రీలో చాక్లెట్ బాయ్ అనగానే చబ్బీ బుగ్గలతో అందంగా కనిపించే రణ్ బీర్ కపూర్ గుర్తుకువస్తాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నెపోటిజం నిందలు ఎదుర్కున్నా తాను వారసత్వంతో వచ్చిన హీరో కాదని..తనకంటూ ఓ ఇమేజ్ ని యూత్ లో క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా యానిమల్ మూవీ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. దర్శకుడు సందీప్ వంగా రణ్ బీర్ క్యారెక్టర్ ను మలిచిన విధానం కొంతమందికి విపరీతంగా నచ్చేసింది. అయితే చాలా మంది ఈ మూవీ కంటెంట్ అపభ్యంగా ఉందని, హీరో బిహేవియర్ ఫ్యామిలీ చూసేలా లేదని విమర్శలు చేశారు. అయినా ఆ మూవీ ఈజీగా రూ.500 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. యానిమల్ తర్వాత రణ్ బీర్ కపూర్ పాన్ ఇండియా సినిమాలపై గురిపెట్టాడు. ఇకపై అలాంటి తరహా సినిమాలు చేద్దామని నిర్ణయించుకున్నాడట. అయితే ఇటీవల ఓ సమావేశంలో తనకి తాను రియలైజ్ అవుతూ తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ఎమోషన్ కు గురయ్యాడు.

ఇప్పటికీ ఆ నిందలు మోస్తున్నా..


తాను జీవితంలో పెద్ద తప్పు చేశానని అంటున్నాడు. అదీ ఇద్దరు స్టార్ హీరోయిన్లను మోసం చేశానని ధైర్యంగా చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో దీపికా పదుకునె, కత్రినా కైఫ్ ఇద్దరితో డేటింగ్ చేశానని అన్నాడు. అయితే ఆ తర్వాత ఆలియా భట్ ను పెళ్లిచేసుకున్నానని..ఇప్పటికీ ఆ ఇద్దరు హీరోయిన్లను తాను డేటింగ్ పేరుతో చీటింగ్ చేశానని చాలా బాధపడ్డాడు. బాలీవుడ్ లో నన్ను అంతా ఇప్పటికీ ఓ మోసగాడుగా చూస్తున్నారని..ఇప్పటికీ ఆ నిందలు భరిస్తున్నానని అన్నాడు.

దాంట్లో తప్పేముంది?

దీనితో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మీరు ఇలాంటి విషయాలను మనసులో దాచుకోకుండా బయటకు చెప్పి మీ నిజాయితీని చాటుకున్నారు. ఇందులో మీ తప్పేమీ లేదు. డేటింగ్ అన్నప్పుడు ఇద్దరూ ఒకరి ఇష్టంతో మరొకరు చేసేది. వాళ్లకు లేని అభ్యంతరం మీకు ఎందుకు..పైగా వాళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ భార్యతో జీవితం పంచుకుని సంతోషంగా ఉన్నారు. అలాంటప్పుడు జరిగిపోయినవి తలుచుకుని బాధపడటం ఎందుకు? అంటూ ఓదారుస్తున్నారు. ఇందులో మీ తప్పేమీ లేదు. మాకు కూడా మీరు తప్పు చేశారని అనిపించడం లేదు. ఈ విషయాన్న మీరు లైట్ గా తీసుకోండని సలహా ఇస్తున్నారు నెటిజన్లు

Related News

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Big Stories

×