BigTV English

Revising Arogyasree Treatment Prices: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించిన ప్రభుత్వం.. ఆ వివరాలివే..

Revising Arogyasree Treatment Prices: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించిన ప్రభుత్వం.. ఆ వివరాలివే..

Revising Arogyasree treatment Prices(TS today news): రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ జీవో 30ని తాజాగా విడుదల చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో ఎటువంటి మార్పు లేదని అందులో స్పష్టం చేసింది.


Also Read: జల్‌శక్తి మంత్రితో రేవంత్ భేటీ.. జల్‌జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని వినతి

Pension For Padma awardees
Pension For Padma awardees

ఇదిలా ఉంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 25 వేల పెన్షన్ అందించనున్నది. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కనుమరుగు అవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.


కాగా, ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెలా రూ. 25 వేల ప్రత్యేక పెన్షన్ ను మంజూరు చేస్తూ జీవోను జారీ చేశారు. అంతేకాకుండా.. పద్మ విభూషన్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 వేల పింఛన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తాజాగా ఉత్తర్వులు జారీ చేశామంటూ మంత్రి పేర్కొన్నారు. భాష, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పెన్షన్ డబ్బులు నేరుగా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనున్నదని తెలిపారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×