BigTV English

KTR : కేటీఆర్ అరెస్ట్? హరీష్‌రావు స్కెచ్!

KTR : కేటీఆర్ అరెస్ట్? హరీష్‌రావు స్కెచ్!

KTR : కేటీఆర్ అరెస్ట్..? ఈ న్యూస్ బీఆర్ఎస్‌ను తెగ టెన్షన్ పెట్టేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అయితే ఎట్టా? అసలే టైమ్ బాలేదు. కేసీఆర్ ఆరోగ్యమూ బాలేదు. ఫ్యామిలీలో సఖ్యత లేదు. గులాబీ బాస్ ఫాంహౌజ్ విడిచిరావట్లేదు. కవితక్క కారు దిగేశారు. అటు కేసీఆర్ రాక.. కవిత లేక.. కేటీఆర్ జైలు కెళితే ఏంటి పరిస్థితి? గులాబీ దండులో తీవ్ర ఆందోళన నెలకొంది. తెలంగాణ భవన్‌లో సీరియస్ వాతావరణం నెలకొంది.


కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఇంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేకపోయేదేమో. కానీ, స్వయంగా కేటీఆరే తన అరెస్టుపై లీకులు ఇవ్వడమే ఇంతటి ఉత్కంఠకు కారణం. ఫార్ములా-ఇ కారు రేస్‌లో ఏసీబీ విచారణకు హాజరవుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారాయన. ఎన్నిసార్లైనా విచారణకు వస్తానంటూనే.. మహా అయితే అరెస్ట్ చేస్తారంటూ.. మళ్లీ జైలుకెళ్లాల్సి వచ్చినా రెడీ అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం అటెన్షన్ అందరి డ్రా చేస్తోంది. అంటే..? కేటీఆర్ మాటలను బట్టి చూస్తే.. తాను అరెస్ట్ అవుతానని ఫిక్స్ అయ్యారా? అరెస్టుపై ఆయన దగ్గరేమైనా ఇన్ఫో ఉందా? అరెస్ట్ పేరుతో కావాలనే పొలిటికల్ టెన్షన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? ఫార్ములా-ఇ కేసులో జరిగిన యవ్వారమంతా ఆయనకే బాగా తెలుసు కాబట్టి.. తన అరెస్ట్ తప్పదని పరోక్షంగా హింట్ ఇచ్చారా? లేదంటే.. ఇదంతా కేడర్‌ను రెచ్చగొట్టే మైండ్ గేమా? అంటూ చర్చ మొదలైంది.

కట్ చేస్తే.. సరిగ్గా ఇదే టైమ్‌లో.. హరీష్‌రావు బీఆర్ఎస్ ఆఫీసులో కీలక సమావేశం పెట్టడం మరింత ఇంట్రెస్టింగ్ విషయం. లాయర్లతో, బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపారు. అంటే..? కేటీఆర్‌ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే.. వెంటనే బెయిల్ కోసం ట్రై చేయొచ్చా? ఈ కేసులు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి మేటర్స్ చర్చించడానికే లాయర్లతో హరీష్ రావు మీటింగ్ అంటూ భవన్ బయట గుసగుసలు వినిపిస్తున్నాయి.


అడ్వకేట్లతో పాటు.. బీఆర్ఎస్ ప్రముఖ లీడర్లతోనూ హరీష్‌రావు మంతనాలు జరుపుతుండటం మరింత ఆసక్తికరం. హరీష్‌రావు స్కెచ్ ఏంటి? పార్టీ పరంగా ఏం వ్యూహాలు రెడీ చేస్తున్నారు? కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయాలనా? విధ్వంస రచన కూడా రచిస్తు్న్నారా? కేటీఆర్ అరెస్ట్ అయితే ఏదో కొంపమునిగిందనేంతలా అల్లర్లతో సీన్ క్రియేట్ చేసే వ్యూహం ఏమైనా తయారవుతోందా? లేదంటే.. కేటీఆర్ జైలులు వెళితే.. నెక్ట్స్ బాస్ తానేనంటూ హరీష్‌రావు ప్లాన్ బి రెడీ చేస్తున్నారా? లోలోన ఏదో జరుగుతోందనే అనుమానం బయటకు బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల్లో ఫార్ములా-ఇ కార్ రేస్‌ కేసు దడ రేపుతోంది. మరి, ఏ1 కేటీఆర్ అరెస్ట్ అవుతారా? బీఆర్ఎస్ నెక్ట్స్ ఏంటి?

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×