The Raja Saab..ప్రొడ్యూసర్ ఎస్.కే.ఎన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా మిగతా ప్రొడ్యూసర్లు అంతా ఒకవైపు .. ఈ ప్రొడ్యూసర్ ఒకవైపు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. స్టేజ్ ఎక్కి మైకు పట్టుకుంటే చాలు ఆయన మాట్లాడే మాటలు, వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ బాగా తెలుసు. అందుకే ఎస్.కే.ఎన్ మైకు పట్టుకున్నాడు అంటే ఎప్పుడు ఏ విషయం ఎలా రివీల్ చేస్తారో తెలియని పరిస్థితి. అంతలా తన మాటలతో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ‘ది రాజా సాబ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో తన స్పీచ్ తో దుమ్ము దులపడమే కాదు.. ఆ ప్రొడ్యూసర్ కి స్టేజ్ పైనే గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎస్ కే ఎన్ స్పీచ్ కి ప్రభాస్ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈయన మాట్లాడిన స్పీచ్ ని బట్టి చూస్తే రాజా సాబ్ మీద పెద్ద నెగిటివ్ క్యాంపైన్ చేసినట్లు ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఒక ప్రొడ్యూసర్ ను ఆయన టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రొడ్యూసర్ ఎవరు? అన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఎస్.కే.ఎన్ స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక్క టీజర్ తో భారీ హైప్..
అసలు విషయంలోకి వెళ్తే.. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం ది రాజా సాబ్. అయితే ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అటు ప్రభాస్ అభిమానులు కూడా ఎంత భయపడ్డారో.. ఎంతగా వ్యతిరేకించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ – మారుతి మూవీ అధికారికంగా ప్రకటించేందుకు కూడా ఆ వ్యతిరేకత కారణంగా మేకర్లు భయపడ్డారు.
అయితే ఎప్పుడైతే సినిమా సెట్ నుంచి ప్రభాస్ స్టిల్స్ లీకయ్యాయో.. ఒక్కసారిగా ప్రాజెక్టు పై పాజిటివిటీ పెరిగిపోయింది. ఏమో అనుకున్నాం కానీ మారుతి.. ప్రభాస్ ను వింటేజ్ మోడ్ లోకి తీసుకెళ్లాడని, వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు కూడా ఖుషీ అయిపోయారు. దీనికి తోడు ఇప్పుడు వచ్చిన టీజర్ తో ఇక భారీగా హైప్ పెరిగిపోయింది.
also read: Tollywood: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..ఇప్పుడో స్టార్ హీరోయిన్!
ది రాజా సాబ్ వెనుక కుట్ర జరిగిందా.. నిర్మాత మాటలకు అర్థం..
ముఖ్యంగా టీజర్ చూశాక మారుతీ సత్తా ఏంటో అందరికీ తెలిసిపోయింది . ఇక ఈ సినిమాతో మారుతి పాన్ ఇండియాని షేక్ చేసేలా కనిపిస్తోంది. అంతేకాదు ఈ టీజర్ కి అటు ఆన్లైన్లో.. ఇటు ఆఫ్లైన్లో తెగ క్రేజ్ లభిస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఇందులో ఎస్ కే ఎన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు.
ఆయన మాట్లాడుతూ..” పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేరును గుర్తుపెట్టుకోండి. ఈ టీజర్ చూస్తేనే వారి బ్రాండ్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై వుంటుంది. టీజీ విశ్వప్రసాద్ విజన్ ఏంటో డిసెంబర్ 5వ తేదీన అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఒక నిర్మాత నెగిటివ్ క్యాంపైన్ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతడే పాజిటివ్ ట్రెండ్ చేస్తారు.. చేసేలా చేస్తాను”.. అంటూ స్టేజ్ పైనే గట్టి వార్నింగ్ ఇచ్చారు నిర్మాత ఎస్కేయన్. ఇక మొత్తానికైతే ఎస్కేఎన్ స్పీచ్ స్టేజ్ పై అదిరిపోయింది. మరి రాజాసాబ్ మీద అంత నెగిటివ్ ప్రచారం చేసిన ఆ నిర్మాత ఎవరని ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు.
రాజా సాబ్పై నిర్మాత కుట్ర – SKN #TheRajaSaabTeaserDay #TheRajaSaabTeaser #TheRajaSaabTeaserJune16 #Prabhas #NidhiAgerwal #MalavikaMohanan #SKN #Tollywood #Maruthi #BIGTVCinema @DirectorMaruthi @SKNonline @peoplemediafcy @vishwaprasadtg pic.twitter.com/9XvRJpBFuF
— BIG TV Cinema (@BigtvCinema) June 16, 2025