E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

IKP Commission: మహిళా సంఘాలలో దారుణం.. కోట్ల రూపాయల కమీషన్లు నొక్కేస్తున్న అధికారులు!

IKP Commission: మహిళా సంఘాలలో దారుణం.. కోట్ల రూపాయల కమీషన్లు నొక్కేస్తున్న అధికారులు!
Advertisement

IKP Commission: స్వచ్ఛ బ్యూరో: అన్నదాతల నుంచి ధాన్యం సేకరిస్తూ, కొనుగోలు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) మహిళా సంఘాల నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడి, ఎండనక వాననక ధాన్యం కొనుగోళ్లను విజయవంతం చేస్తున్న మహిళలకు రావాల్సిన ‘కమీషన్’ సొమ్మును విడుదల చేయడంలో అలస్యం అవుతోంది. గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన బకాయిలే ఇంకా పూర్తిగా చెల్లించకపోగా, ప్రస్తుత యాసంగి సీజన్ కమీషన్ కూడా కోట్లలో పేరుకుపోతుండటంతో మహిళా సంఘాల నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కేవలం రూ.50కోట్లు మాత్రమే..

రాష్ట్రంలో గత వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో 3192 ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను 4,43,799 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం క్వింటాకు 40 రూపాయలు ఐకేపీ నిర్వాహకులకు చెల్లిస్తోంది. కొనుగోలు చేసినందుకు ప్రభుత్వం 80.60కోట్లు కమీషన్ చెల్లించాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.50కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన రూ.30.60కోట్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఐకేపీ నిర్వాహకులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాత బకాయిలే ఇవ్వకపోతే కేంద్రాల నిర్వహణ ఖర్చులు, హమాలీ చార్జీలు, ఇతర రవాణా ఖర్చులు ఎలా చెల్లించాలని మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.కేంద్రాల నిర్వహణ కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2961 ఐకేపీ కేంద్రాలు

Advertisement

ఇదిలా ఉండగా, ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2961 ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే చివరి నాటికే ఐకేపీ కేంద్రాలతో 16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశారు. కమీషన్ రూ.51కోట్లకు చేరింది. ప్రస్తుతం జూన్ నెల నడుస్తున్నా, ఇంకా అనేక చోట్ల కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఈ కొనుగోళ్ల కమీషన్ పెరగనుంది.

Also Read: నా సీటు చోరీ జరిగింది.. ఎలాంటి లీగల్ కేసుల్లేవ్, అందుకే మీడియా ముందుకు మీనాక్షి నటరాజన్

lso read: ఆందోళనలో ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు

Advertisement

“ఐకేపీ కేంద్రాల నిర్వహణకు హమాలీ కూలీలు, తూకం వేసేవారు, క్లీనర్లు, రవాణా ఖర్చులు.. ఇలా ఎన్నో ముందస్తు ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వం సకాలంలో కమీషన్ ఇవ్వకపోతే మేము ఈ కేంద్రాలను ఎలా నడపాలి? అప్పులు తెచ్చి కేంద్రాలు నడుపుతున్నాం, వడ్డీలు కట్టలేక చస్తున్నాం” అని పలువురు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కమిషన్ ఎప్పటిలోగా ఇస్తారు?

ప్రభుత్వ అలసత్వం వల్ల క్షేత్రస్థాయిలో ఐకేపీ సంఘాల నెట్‌వర్క్ దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. కమీషన్ డబ్బులు వస్తేనే మహిళా సంఘాల సభ్యులకు కొంత ఆసరా లభిస్తుంది. కానీ నెలల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు స్పందించి.. పెండింగ్‌లో ఉన్న వానాకాలం, యాసంగి కమీషన్లను వెంటనే విడుదల చేయాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుత యాసంగి కమీషన్ సొమ్మును ఎప్పటిలోగా విడుదల చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ధాన్యం సేకరించి పెడుతున్న మహిళలకు, వారి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

అప్పులు తెచ్చి కేంద్రాలు నడుపుతున్నాం..

“రైతులకు ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పులు తెచ్చి మరీ ఐకేపీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. కానీ ప్రభుత్వం ఇచ్చే కమీషన్లు సకాలంలో రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి కమీషన్ విడుదల చేయాలని,ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు తెలిపారు.

Also read: Yoga Day Celebrities: యోగా డే స్పెషల్.. హీరోయిన్ల యోగ పోజులు..

Related News

Spy Camera: హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు..!

ఆ తప్పు చేయొద్దు.. ‘సర్’ విషయంలో కేడర్‌ని అలర్ట్ చేసిన కేటీఆర్.. అర్జున్‌రెడ్డి హిట్-రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్

నా సీటు చోరీ జరిగింది.. ఎలాంటి లీగల్ కేసుల్లేవ్, అందుకే మీడియా ముందుకు మీనాక్షి నటరాజన్

దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. తెలంగాణలో భారీ వర్షాలు, ఇక హైదరాబాద్‌లో

హైడ్రా పేదల ఇళ్ల జోలికెళ్లదు.. కబ్జాలు నిర్థారించాకే చర్యలు.. కమిషనర్ రంగనాధ్

బొగ్గు స్కామ్ దాచేందుకే.. కిషన్ రెడ్డిపై దుష్ప్రచారం.. సీఎంపై రామంచర్ రావు ఫైర్

టార్గెట్ మెట్రో ఫేజ్-2.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ.. రైల్వే మంత్రితో భేటికి డిమాండ్

Big Stories

×