E-Paper
Advertisement

నిర్మల్ గడ్డ.. కాషాయ అడ్డా! తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే: బండి సంజయ్

నిర్మల్ గడ్డ.. కాషాయ అడ్డా! తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే: బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్‌ది రాక్షస సేన.. అని, మోదీపై విషప్రచారాన్ని గరళంలా భరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిర్మల్‌ గడ్డ కాషాయ అడ్డా అని, తెలంగాణలో ఇకపై ఎగరబోయేది కాషాయ జెండానేనని పేర్కొన్నారు .

బండి సంజయ్ మాట్లాడుతూ..

Advertisement

నిర్మల్ లో మంగళవారం నిర్వహించిన రావిలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇటలీ సంతతికి చెందిన వారు దేశ ప్రధాని కావాలని కలలు కంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ రాక్షస సేనగా మారిందని, ఆ పార్టీ చేస్తున్న నిందలను ప్రధాని నరేంద్ర మోదీ గరళ కంఠుడిలా భరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, ఇండీ కూటమి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగానికి ముందు కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయగా, అలా చేస్తే మైక్‌ బంద్‌ చేస్తానంటూ వారిని మందలించారు.

రాహుల్‌కు ‘సర్‌’పై అవగాహన లేదు..

Advertisement

ఓటర్ల జాబితా ప్రక్షాళన (సర్‌)పై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను బండి సంజయ్‌ తప్పుబట్టారు. రాహుల్‌గాంధీకి సర్‌పై కనీస అవగాహన లేదని విమర్శించారు. 2004లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆ తర్వాత ఎమ్మెస్సార్‌ వంటి నాయకులు మరణించినా ఓటర్ల జాబితాలో పేర్లు కొనసాగుతున్నాయని, మరణించిన వారి పేర్లతో పాటు డూప్లికేట్‌ ఓట్లను తొలగించకూడదా అని నిలదీశారు. ఈ దేశ పౌరులే ప్రధానిని, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వంటి దేశాలకు చెందిన వ్యక్తులు భారత ప్రధాని, ముఖ్యమంత్రులను నిర్ణయిస్తామంటే సహించేది లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం..

కాంగ్రెస్‌ నేతలు ఇదే వైఖరి కొనసాగిస్తే త్వరలోనే ఎన్ఆర్సీని తీసుకొచ్చి తీరుతామని వ్యాఖ్యానించారు. తమకు గ్లాసుల్లో మద్యం పోసే సంస్కృతి లేదని, ఢిల్లీ పెద్దలకు డబ్బు సంచులు పంపే అలవాటు కూడా లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతలను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ భీమా వ్యక్తం చేశారు.

Also Read: 20 రోజుల పని.. 5 రోజుల్లోనే పూర్తి! తుఫాన్ల ధాటికి చెక్కుచెదరని చంద్రబాబు వ్యూహం!

Tags

Related News

షూటింగ్స్‌కు వెళ్లవద్దని బాబాయ్ మందలింపు.. 21 ఏళ్ల  యువతి ఆత్మహత్య!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. మిత్రపక్షాల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి

చెంగిచెర్లలో హైడ్రా హల్చల్.. రియల్ ఎస్టేట్ ముఠా దందా గుట్టు రట్టు!

అయ్యప్ప భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు!

జలమండలికి సవాల్‌తో కూడిన మెగా ఆపరేషన్.. చకా చకా రిపేర్లు!

కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించడి.. అధికారులు భట్టి విక్రమార్క ఆదేశం!

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.6.78 కోట్ల ఫేక్ నోట్లు గుర్తింపు.. నిందితులు అరెస్ట్!

Big Stories

Advertisement
×