E-Paper
Advertisement

Saraswati Pushkaralu: సరస్వతి నదీ పుష్కరాల పై అధికారుల సమీక్ష.. కీలక అంశాలపై చర్చ..!

Saraswati Pushkaralu: సరస్వతి నదీ పుష్కరాల పై అధికారుల సమీక్ష.. కీలక అంశాలపై చర్చ..!
Advertisement

Saraswati Pushkaralu: సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. సోమవారం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల పై దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు.

త్రివేణి సంగమంలో

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. కాళేశ్వరంలో గత సంవత్సరం సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని, లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం మే 21 నుండి నిర్వహించబోయే సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.30.60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. లక్షలాది భక్తులు అంత్య పుష్కరాలలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం త్రాగు నీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణతో పాటు విద్యుత్ సరఫరా, దేవస్థానం ప్రాంగణంలో భక్తుల క్యూలైన్ల ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

Advertisement

Also Read: KTR vs Kavitha: చెడ్డోళ్లపై కేసీఆర్ బ్రాండ్ వేసి అమ్ముతారా?.. కవిత ప్రశ్నలకు కేటీఆర్ షాకింగ్ కౌంటర్!

లైన్ డిపార్ట్ మెంట్లతో సమావేశం

సరస్వతి ఆది పుష్కరాలలో చేపట్టిన శాశ్వత ప్రాతిపదిక పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రసాదం కౌంటర్, రేయిలింగ్, సరస్వతి విగ్రహం వద్ద పెయింట్ వర్క్స్ గ్రానైట్ పరచడం, ఆర్చ్‌ల నిర్మాణం, విద్యుత్ పనులు, పెయింట్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. లైన్ డిపార్ట్ మెంట్లతో సమావేశం నిర్వహించి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏర్పాట్లు కావాలసిన శాఖ పరమైన మంజూరులను వెంట వెంట నే పూర్తి చేసి టెండర్ లను పిలవాలని పనులు మొదలుపెట్టి నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఆమె తెలిపారు. 8వ తేదీ వరకు అంచనా ప్రతిపాదనలు అందచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పి సంకీర్త్, అదనపు కలెక్టర్ ఆశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇరిగేషన్, పంచాయతి రాజ్, దేవాదాయ, వైద్య, ఆర్ అండ్ బి, విద్యుత్తు, మిషన్ భగీరథ తదితర శాఖల పాల్గొన్నారు.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: పాక్ ప్లేయర్ పై వైభ‌వ్ సూర్యవంశీ దాడి ? మ్యాచ్ మ‌ధ్యలో గొడ‌వ, వీడియో వైర‌ల్

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×