Labour Scam: స్వేచ్చ బ్యూరో: ప్రజలకు మెరుగైన సత్వర సేవా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సేవలను ఒకే చోట పొందేందుకు రూపకల్పన చేసింది. అందులో భాగంగా ప్రజలకు అందుబాటులో సేవలను ఉంచేందుకు మీ సేవ అనే పేరుతో జనాభా కనుగుణంగా మీ సేవ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రజలకు సత్వర సేవలు నిర్ణీత ఫీజులతో చేయాల్సి ఉండగా కొందరు డబ్బుపై వ్యామోహంతో ఆ సేవలను పక్కదారి పట్టిస్తూ ఏకంగా గ్రామాలలో తిరుగుతూ అక్రమార్జనే ధ్యేయంగా మీసేవ ఐడీలను దుర్వినియోగపరుస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారు.
గ్రామాలలో ఈ దందాకు బ్రోకర్లు జమవడంతో లేబర్ కార్డు అవసరం ఉన్న వినియోగదారుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ దోచుకునేందుకు కొందరు మీ సేవ నిర్వాహకులు,సిబ్బంది బ్రోకర్లతో కలిసి దందాకు ఇష్టారితిగా తెర లేపుతున్నారు. రేషన్ కార్డుల దందా అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకొని కొందరు దళారులు మీసేవ కేంద్రాల నిర్వాహకులు చేస్తున్న అక్రమ వసుల్ల వ్యవహారం.ప్రభుత్వం అతి తక్కువ ఫీజుతో ఇచ్చే లేబర్ కార్డుల కోసం కార్మికుల నుంచి భారీగా దళారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు.
జిల్లాలోని పలు గ్రామాలలో అనధికారికంగా మీసేవ ఐడీలను వినియోగిస్తూ అక్రమంగా లేబర్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను చేపడుతున్నారు. ఆదివారం గద్వాల సమీపంలోని నది అగ్రహారం గ్రామంలో మీసేవ ఐడితో లేబర్ కార్డులను దరఖాస్తు చేశారు. అదేవిధంగా గట్టు, ధరూరు, కేటి దొడ్డి మండలాలలో సైతం ఐడీల దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమంగా కొందరు మీ సేవ నిర్వాహకులు ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
Also read: Parliament Numbers: రాజ్యాంగ సవరణకు మోదీ సర్కార్ అడుగులు.. ఆ 6 ఓట్ల కోసం డీఎంకేతో బీజేపీ దోస్తీ..?
సాధారణంగా లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. కానీ దళారులు కార్మికుల నుంచి రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. కార్డు ఉంటే చనిపోయినప్పుడు వచ్చే డెత్ బెనిఫిట్స్, ప్రమాద బీమా, పెళ్లి కానుకలు వంటివి త్వరగా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. కేవలం డబ్బుల కోసం భవన నిర్మాణ కార్మికుల కాని వారికి కూడా నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసి లేబర్ ఆఫీసులో కార్డులు మంజూరు చేయుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులకు ఆన్లైన్ దరఖాస్తులపై అవగాహన లేకపోవడానికి దళారులు ఆసరాగా చేసుకుంటున్నారు.నిర్మాణ రంగానికి సంబంధించిన పనులు చేసే వారే దీనికి ప్రధాన అర్హులు దీనికి నిర్ణీత వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి.తాపీ మేస్త్రీలు, కూలీలు,పెయింటర్లు, ఎలక్ట్రిషన్లు, వెల్డర్ లు, ప్లంబర్లు, రోడ్డు పనులు చేసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు చేసుకున్నందుకు ఏడాదిలో కనీసం 90 రోజులు కార్మికుడిగా పని చేసి ఉండాలి.
లేబర్ ఆఫీసులో అధికారులు పైరవీకార్లకు పెద్దపీట వేస్తున్నారు. అర్హులైన ప్రజలు లేబర్ కార్డు కోసం దరఖాస్తు చేసే కార్డు పొందేందుకు ప్రమాదవశాత్తు ప్రమాదం మరణాలు సంభవిస్తే రావాల్సిన నగదు పొందేందుకు పైరవీకారులు పెద్ద మొత్తంలో అధికారులతో పైరవీలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే బాధితుడు ఆఫీసుకు వెళ్తే కనీసం సమాచారం ఇవ్వకుండా దళారుల పేర్లు చెబుతూ వారిని కలవండి చేస్తారు అని చెబుతుండడంతో బాధితులు వారికి సొమ్ము ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. దళారుల దందాకు చెక్ పెట్టేందుకు సంబంధిత అధికారులు దృష్టి సారించి దుర్వినియోగానికి పాల్పడుతున్న సెంటర్ లపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని వినియోగదారులు,ప్రజలు కోరుతున్నారు.
Also Read: Temple Donations: రచ్చకెక్కిన అయోధ్య రామాలయం.. వజ్రాలు, బంగారం, హుండీ డబ్బులు మాయం..!