E-Paper
Advertisement

Parliament Numbers: రాజ్యాంగ సవరణకు మోదీ సర్కార్ అడుగులు.. ఆ 6 ఓట్ల కోసం డీఎంకేతో బీజేపీ దోస్తీ..?

Parliament Numbers: రాజ్యాంగ సవరణకు మోదీ సర్కార్ అడుగులు.. ఆ 6 ఓట్ల కోసం డీఎంకేతో బీజేపీ దోస్తీ..?
Advertisement

Parliament Numbers: పార్లమెంట్‌లో నంబర్ల గేమ్ మారుతోంది. విపక్ష కూటముల్లో ముదురుతున్న తిరుగుబాట్లు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయా? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి మోడీ సర్కార్‌ విప్లవాత్మక అడుగులు వేస్తోందా? పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీకి ఎన్డీఏ కూటమి కేవలం అంటే కేవలం 6 ఓట్ల దూరంలోనే ఉందా? బెంగాల్‌లో దీదీకి షాక్ మహారాష్ట్రలో ఉద్ధవ్‌కు ‘ఆపరేషన్ టైగర్’ ఎఫెక్ట్ అసలు ఏంటి ఈ పార్లమెంట్ నంబర్ గేమ్? వచ్చే నెల వర్షాకాల సమావేశాల్లోనే మోడీ మార్క్ సంచలనం జరగబోతోందా?

మహిళా రిజర్వేషన్‌లో..

ఏప్రిల్ నెలలో మహిళా రిజర్వేషన్‌లో భాగమైన డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో విపక్షాలన్నీ ఏకమై అడ్డుకున్నాయి. నాడు 54 ఓట్ల తేడాతో బిల్లుకు బ్రేక్ పడింది. కానీ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. మోడీ సర్కార్ సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది.

ఆపరేషన్ టైగర్..

Advertisement

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 28 మంది లోక్‌సభ ఎంపీల్లో ఏకంగా 20 మంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఒక చిన్న పార్టీలో విలీనమై ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి జై కొడుతున్నారు. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో ఆపరేషన్ టైగర్ నడుస్తోంది. ఉద్ధవ్ టీమ్‌లోని 9 మంది ఎంపీలలో ఆరుగురు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. వీరంతా సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు టాక్.

Also read: దేశ వ్యాప్తంగా మరో 7 కొత్త బుల్లెట్ రైల్ రూట్లు, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

బీజేపీ పక్కా ప్లాన్‌..

Advertisement

ఈ లెక్కలన్నీ పార్లమెంట్‌లో ఎన్డీఏ బలాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులకు లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ.. అంటే 360 ఓట్లు కావాలి. ప్రస్తుతం తృణమూల్ రెబల్స్ తో కలిపి ఎన్డీఏకు 318 మంది ఎంపీల బలం ఉంది. అప్పటి ఓటింగ్ ప్రకారం ప్రభుత్వానికి మరో 54 ఓట్లు అవసరం కాగా టిఎంసి రెబల్స్ 20 మంది, శివసేన రెబల్స్ఆరుగురితో ఆ లోటు 26కి తగ్గిపోయింది. చిన్నా చితకా పార్టీల సపోర్ట్‌తో ఎన్డీఏ బలం 348కి చేరుకుంటుందని అంచనా. అంటే మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 6 ఓట్లు మాత్రమే తక్కువ. ఆ మిగిలిన 6 ఓట్లను కూడా సమాజ్ వాదీ పార్టీ, లేదా విపక్ష కూటముల్లోని ఇతర చిన్న పార్టీల నుండి రాబట్టవచ్చని బీజేపీ పక్కా ప్లాన్‌తో ఉంది. అటు తమిళనాడులో DMKతో కమలనాథులు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రాజ్యసభ ఎంపీలు..

రాజ్యసభ విషయానికి వస్తే.. ఇక్కడ మూడింట రెండొంతుల మెజారిటీకి 164 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 150 మంది ఎంపీలు ఉన్నారు. ఒకవేళ డీఎంకేకు చెందిన 8 మంది రాజ్యసభ ఎంపీలు మద్దతిస్తే ఈ సంఖ్య 158కి చేరుతుంది. ఇక్కడ కూడా కేవలం 6 ఓట్లే తక్కువవుతాయి. అయితే, తాజా ఎన్నికల ద్వారా ఎన్డీఏ ఈ మార్కును చాలా ఈజీగా దాటుతుందని లెక్కలు వేస్తున్నారు.

వన్ నేషన్, వన్ ఎలక్షన్..

సో.. మొత్తానికి ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ నంబర్ల గేమ్ గనుక వర్కవుట్ అయితే వచ్చే నెలలోనే దేశ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన డీలిమిటేషన్ బిల్లుతో పాటు.. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి విపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ మోడీ సర్కార్ ఈ నంబర్ గేమ్ లో విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Also read: Hangor Submarines: బంగాళాఖాతంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. భారత్ ముంగిట్లోకి పాక్ సబ్‌మెరైన్లు..!

Related News

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!

లివింగ్ రిలేషన్‌షిప్‌పై సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జ్‌మెంట్!

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

న్యాయం ఆలస్యమైతే అన్యాయమే!

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

క్షుద్రపూజ‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తెలంగాణ‌.. అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిజీగా రెండు పార్టీలు!

తెలంగాణ సచివాలయంలో షాడో ల దందా కలకలం!

Big Stories

Advertisement
×