BigTV English

Hyderabad Weather: హైదరాబాద్ కు ముందే వచ్చిన వేసవి.. 5 రోజులు భగభగలు..

Hyderabad Weather: హైదరాబాద్ కు ముందే వచ్చిన వేసవి.. 5 రోజులు భగభగలు..

Hyderabad Weather: ఎండాకాలం రాకమునుపే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడ మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఎండ ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారుల అంచనా. అందులో కూడ భాగ్యనగరం భగభగ మండే అవకాశాలు ఉన్నాయట. ఔను.. ఇంకా ఎండా కాలం రాకమునుపే, నగరవాసులకు భానుడి భగభగల రుచి ముందే ఎదురుకానుందట. రాబోయే ఐదు రోజులు నగరంలో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


వేసవి వచ్చేందుకు ఇంకా సమయం ఉంది. మహా శివరాత్రి పర్వదినం కూడ రానే లేదు. అప్పుడే హైదరాబాద్ నగరానికి ఎండలపై వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. మొన్నటి వరకు నగరంలో తీవ్రమైన చలిగాలుల ధాటికి నగరవాసులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉదయం 11 గంటలకు కూడ మంచు కురిసే వేళలలను సిటీ వాసులు ఆస్వాదించారు. అంతేకాదు నగరంలోని రహదారులు కూడ మంచుధాటికి కనిపించని పరిస్థితి. ఈసారి చలికాలంలో నగరంలో చలిమంటలు కూడ కనిపించాయి.

ఇప్పటి పరిస్థితి అందుకు అంతా భిన్నం. ఔను.. సమ్మర్ సీజన్ రాకమునుపే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 6 గంటలకే సూర్యుడి ప్రతాపంతో ప్రజలు.. అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ ఉక్కపోత వాతావరణం కనిపిస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. ఇంకా ఎండాకాలం రాకమునుపే ఇవేమీ ఎండలు అనే స్థాయికి ఇప్పుడే ఎండ రుచి నగరవాసులకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వాతావరణ అంచనాదారుడు బాలాజీ కీలక ప్రకటన చేశారు. 2025 వేసవి ప్రారంభంలోనే నగరానికి ఎండదెబ్బ తగులుతుందని, అందుకు నగరవాసులు కూడ సిద్దంగా ఉండాలన్నారు.


రాబోయే 5 రోజులు వేసవి తీవ్రత హైదరాబాద్ లో 38 డిగ్రీల సెల్సియస్‌కు, ఇతర జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంచనా వేసిన భారత వాతావరణ శాఖ తెలంగాణ అంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్, నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 మరియు 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. తూర్పు, ఉత్తర తెలంగాణ 38 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉక్కపోతను ఎదుర్కొంటుందని, హైదరాబాద్‌లో 36 డిగ్రీల సెల్సియస్ నుండి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని బాలాజీ హెచ్చరించారు. ఈ వేడి ప్రభావం ఫిబ్రవరి 19 లేదా 20 వరకు కనీసం ఐదు నుండి రోజుల వరకు ఉంటుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల ఉంటుందని భావిస్తున్నానన్నారు.

Also Read: Maha Shivaratri 2025: మహా శివరాత్రికి ఏర్పాట్లు.. వీటి అమ్మకాలు నిషేధం..

ఈ ప్రకటన బట్టి నగరానికి ముందే సమ్మర్ సీజన్ వచ్చిందని చెప్పవచ్చు. దీనితో నగరవాసులు ఎండల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా చిన్నారులు, వృద్దులు జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త.. ముందే ఎండలు పలకరిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×