BigTV English

AI Action Summit : ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు పోవు – మోదీ చెప్పిన లాజిక్ ఇదే

AI Action Summit : ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు పోవు – మోదీ చెప్పిన లాజిక్ ఇదే

AI Action Summit : ప్రపంచ దేశాలు యువతకు నైపుణ్యాలు, అవసరాల మేరకు రీ-స్కిల్లింగ్ అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. ఈ విధానం తప్పదన్నారు. అయితే.. ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతాయన్న భయాన్ని వదిలి పెట్టాలన్న ప్రధాని మోదీ.. ఓసారి చరిత్రను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఎంతటి టెక్నాలజీ వచ్చినా.. ఉద్యోగాల తీరు మారుతుంది తప్పితే, పూర్తిగా ఉద్యోగాలు మారిపోతాయనే ఆలోచన సరైంది కాదన్నారు. ఫ్రాన్స్ వేదికగా నిర్వహించిన ఏఐ యాక్షన్ సమ్మిట్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నరు. ప్రస్తుత ఏఐ ప్రపంచంలో భారత్ ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుందో వివరించారు.


ఏఐ యాక్షన్ సమ్మిట్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ అధ్యక్షత వహించగా, ప్రధాని మోదీ సహ-అధ్యక్షత వహించారు. ప్రస్తుత ప్రపంచంలో నమ్మకం, పారదర్శకత ఉండేలా.. ఓపెన్ సోర్స్ సిస్టమ్ ను డెవలప్ చేయాలని సూచిన ప్రధాని.. ప్రజలే కేంద్రంగా ఉండేలా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎలాంటి వివక్షలకు తావులేకుండా నాణ్యమైన డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అదే సమయంలో మనల్ని తప్పుదోవ పట్టిస్తున్న సైబర్ సెక్యురిటీ, తప్పుడు సమాచార వ్యాప్తి, డీప్ ఫేక్ వంటి వాటిని నిరోధించేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.

ఏఐ గురించి తెలిసిన తర్వాత చాలా మందిలో ఉద్యోగాలు కోల్పోతారనే భయం పట్టుకుందని.. కానీ టెక్నాలజీ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రసక్తే లేదన్నారు. కేవలం దాని స్వరూపం మారుతుందని, చరిత్ర అదే నిరూపించిందని అన్నారు. అందుకే ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు యువతకు స్కిల్, రీ-స్కిల్ చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనుకున్న సమయం కంటే చాలా వేగంగా వినియోగంలోకి వస్తుందన్నారు. అందుకే.. ఈ రంగంలో పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, విలువల్ని పంచుకునేందుకు, ప్రమాదాలపై హెచ్చరించుకునేందుకు, పరస్పర నమ్మకం కోసం.. ఉమ్మడి కార్యచరణ అవసరం అని అభిప్రాయపడ్డారు.


ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. మిలియన్ల మంది జీవితాల్లో మార్పులు తెస్తుందని అన్నారు. కోట్ల మంది ఆరోగ్యం, విద్యా, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణంగా నిలుస్తుందని అన్నారు. తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని చేరుకునేందుకు మరింత తేలికైన, సులువైన మార్గం దొరికినట్లైందని అన్నారు. అందుకే.. మనమంతా కలిసికట్టుగా వనరుల్ని, నైపుణ్యాల్ని ఒక్కచోటకి చేర్చాలని పిలుపునిచ్చారు.

Also Read : ఉక్రెయిన రష్యాలో భాగం కావచ్చు – ట్రంప్ బాబు పేల్చాడు

ఇటీవల కాలంలో అనేక ఐటీ సంస్థలు వారి ఉద్యోగుల్లో చాలా మందిని తొలగిస్తున్నాయి. వారికి కనీస కోడింగ్ నాలెడ్జ్ కానీ, ఇతర సంస్థ అవసరాలకు సరిపడా పరిజ్ఞానం ఉండడం లేదని అంటున్నాయి. పైగా.. చాలా మ్యానువల్, ఒకేరకమైన పనుల్ని ఏఐ సమర్థవంతంగా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఐ కారణంగా ఉద్యోగులు పోతున్నాయనే భావన ఎక్కువైంది. కానీ.. అది సరైన ఆలోచన కాదని ప్రధాని మోదీ.. అంతర్జాతీయ వేదిక నుంచి స్పష్టం చేశారు.  మారుతున్న ప్రపంచంలో, మారిపోతున్న అవసరాలకు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు అవసరమని… అందుకు తగ్గట్లు యువత నైపుణ్యాలు అలవరుచుకోవాల్సి ఉంటుదన్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×