Chandoo Mondeti: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పించారు. ఫిబ్రవరి 7 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నాలుగు రోజుల్లో తండేల్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.73.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది. చై కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇప్పటివరకు చై పాన్ ఇండియా సినిమాలో నటించలేదు. ఇదే ఆయన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అక్కినేని ఫ్యాన్స్ మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక తండేల్ భారీ విజయాన్ని అందుకోవడంతో మేకర్స్ తండేల్ లవ్ సునామీ వేడుకలు పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. ” ఇక్కడకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మా క్యాస్ట్ గురించి చెప్పాలంటే ఇది ఈవెంట్ కాదు. దానికి సపరేట్ ఈవెంట్ పెట్టాలి. ఇక ఇప్పుడు ఈ వేడుక గురించి మాట్లాడాలంటే.. చైతూ గారు మీ లైఫ్ లో మీ లక్కీ ఛార్మ్ విశాఖ క్వీన్.. నా లైఫ్ లో నా లక్కీ ఛార్మ్ నా విశాఖ క్వీన్.
నాగార్జున గారు.. చైతూ కు ఈ హిట్ రావడం మీకెంత సంతోషంగా ఉందో నాకు తెలుసు. మీ మాటల ద్వారా, మీ ముఖ కవళికల ద్వారా.. మీ ట్వీట్ ద్వారా చూపించారు. అంతకు మించి సంతోషంలో మేము ఉన్నాం. ఇకనుంచి ఆయనకు అన్ని సిక్సర్లే. ఈ సినిమా కోసం పనిచేసినవారందరి గురించి మాట్లాడాలి. ముందుగా దేవిశ్రీప్రసాద్. ఈ కథను ఆయన అర్ధం చేసుకున్నట్లు.. ఇంకెవరు అర్ధం చేసుకోలేదు. ఈ కథ మీ మ్యూజిక్ రూపంలోనే బయటకు వచ్చింది. ఇలాంటి పాటలు మీకు అలవాటు.. నాకు లేదండి.. థాంక్యూ.
నా తరువాత ఈ సినిమను నమ్మింది ఎడిటర్ నవీన్ నూలి. ముఖ్యంగా ఇంత బాగా.. ఎమోషనల్ గా ఈ స్టోరీ రావడానికి కారణం టెక్నీషయన్స్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.. అందుకే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. నిర్మాత వాసుగారు.. ఆయనకు మనుషులతోనే రిలేషన్.. వారి సక్సెస్, ప్లాప్ లతో కాదు. నాకు ఈ ఛాన్స్ సవ్యసాచి తరువాత వచ్చింది. నార్మల్ గా నెక్ట్స్ సినిమా ఎప్పుడమ్మా అని అడిగారు. అది నాకు మంచి జోష్ ను ఇచ్చింది. కార్తికేయ 2 తరువాత కూడా నాతో ఆయన అలానే ఉన్నారు.
అల్లు అరవింద్ గారు గురించి చెప్పాలంటే.. నా లైఫ్ లో మా నాన్నగారిని చూసి ఒక క్రమశిక్షణ, భక్తి ఇవన్నీ నాకు వచ్చాయి. నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆయనలాంటి లక్షణాలు ఎవరిలో అయినా ఉన్నాయా అంటే అది అల్లు అరవింద్ గారిలోనే. వేరే లెవెల్.వే ఆఫ్ లివింగ్ అనేది ఒకరు సద్గురు దగ్గర .. ఒకరు వివేకానంద దగ్గర నేర్చుకుంటారు. నేను అల్లు అరవింద్ గారి దగ్గర నేర్చుకున్నాను.
శోభితా గారు తెలుగు బాగా మాట్లాడతారు. ఆ తెలుగును చైతన్యకు కూడా నేర్పించండి. త్వరలో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథ మళ్లీ ఒక అత్యద్భుతంగా రాసి.. ఈ తరానికి ఏం చెప్పాలి.. తెనాలి రామకృష్ణ.. ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్.. ఒక హిస్టారికల్ క్యారెక్టర్ అది. దాన్ని ఈ తరానికి ఎలా తీసుకురావాలి అనేది.. ఏఎన్నార్ లా చేసే అభినయం ఆయన చేస్తాడు .. మనం చూస్తాం” అని చెప్పి ముగించాడు.