E-Paper
Advertisement

Ayodhya Ram Mandir Rangoli : అయోధ్య రాముడిపై అభిమానం.. సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం..

Ayodhya Ram Mandir Rangoli : అయోధ్య రాముడిపై అభిమానం.. సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం..
Advertisement

Ayodhya Ram Mandir Rangoli : హిందు సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి అంటేనే ఆడవాళ్లకు ముగ్గుల పండుగ. రంగు రంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తోంది. పండగ రోజు ఎవరి ఇంటి ముందు చూసినా రంగ వల్లులు దర్శనమిస్తాయి.

అయితే దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్నా ఈనెల 22న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట గురించే వినిపిస్తోంది. ఎవరికి వారు ఆ రాముడిని తలుచుకుంటూ తమ తమ పద్దతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలానికి చెందిన చౌదరి శ్రీదేవి, ఆనంద్ దంపతులు వినూత్నంగా ఆలోచించారు.

Advertisement

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఇంటి ముందు రాముడు ముగ్గు వేశారు. శ్రీరాముడి తలంబ్రాల వితరణ జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఆ ఆలోచనతోనే ఇంటి ముందర ఆయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఈ ముగ్గు వేసినట్లు తెలిపారు.

మరో వైపు కేసముద్రం స్టేషన్‌కు చెందిన దుర్గా, ప్రసన్న, రోజా శ్రీరాముడు కొలువుదీరనున్న అయోధ్య ఆలయాన్నే ముగ్గుగా వేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ ముగ్గులను చూసిన ప్రతీ ఒక్కరూ భక్తి పారవశ్యంతో మునిపోతున్నారు.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×