Cm Revanth Reddy: పెట్టుబడిదారి ఆలోచన ఉన్న వ్యక్తిని కాను, మధ్యతరగతి నుంచి వచ్చిన వాడనని మధ్యతరగతి ఆలోచనలు ఉంటాయని, అందుకే కొన్ని ప్రతిపాదనలు ఆమోదించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గొల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. అనంతరం అభివృద్ది ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అపోహలు నమ్మితే మీకు రాష్ట్రానికి నష్టమే అన్నారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నానని తెలిపారు.
Also Read: Mrunal Thakur: క్షమాపణలు కోరిన మృణాల్… చాలా సిల్లీగా మాటాడాను అంటూ!
నేను ఢిల్లీకి వెళ్లి మాట్లాడి హైదరాబాద్ , వరంగల్ కు ఎయిర్ పోర్టులు తీసుకుని వచ్చానని అన్నారు. 11 రేడియల్ రోడ్లకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అపోహలు పటాపంచలు చేశామని సీఎం పేర్కొన్నారు. విధాన పరమైన నిర్ణయాల్లో పాదదర్శకత ఉండాలన్నారు. ఆ విధానాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అపోహలు సృష్టించి అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఐటీ పాలసీ విషయంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి నుంచి చంద్రబాబు, వైఎస్ వరకు విధానాలు కొనసాగించారు.
Also Read: Bhagya Sri Borse: ఆలోచనలో పడ్డ భాగ్యశ్రీ.. ఏమైంది బేబీ!
ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి. నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, అభివృద్ధిని కొనసాగించాలన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రపోజ్ చేసి కాలుష్య రహిత నగరాన్ని తయారు చేయాలని అనుకుంటున్నా అని సీఎం తెలిపారు. మెట్రో విషయంలో ఆనాడు జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. కానీ తర్వాత ఎందుకు విస్తరణ జరగలేదు. అవుటర్ రింగ్ రోడ్డుతో సమానంగా మెట్రో ఎందుకు? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జనానికి ఉపయోగపడే విధంగా మెట్రో ఉండాలన్నారు. అందుకే రీ డిజైన్ చేశాము. శామీర్ పేట్ వరకు మెట్రో విస్తరణ జరగాలి. మెట్రోకి కేంద్రమే అనుమతులు ఇవ్వాలన్నారు.కాళేశ్వరం కోసం 11ఏళ్ల కోసం 11.5 శాతానికి అప్పులు తెచ్చారు. రుణ వ్యవస్థీకరణ జరగాలని మోడీని కోరా అని సీఎం తెలిపారు. తొలి దశలో రూ.26వేల కోట్లు 7.5 శాతం వడ్డీకి ఇవ్వాలని కేంద్రానికి కోరి సాధించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.