BigTV English

car racing: ఒక్కరోజులోనే 5 ప్రమాదాలు.. ఇండియా రేసింగ్ లీగ్ రద్దు..

car racing: ఒక్కరోజులోనే 5 ప్రమాదాలు.. ఇండియా రేసింగ్ లీగ్ రద్దు..

car racing: ప్రెస్టీజియస్ ఈవెంట్. హైదరాబాద్ పేరు మారుమోగిపోయే రేసింగ్. అలాంటి ఇండియన్ రేసింగ్ లీగ్ లో వరుస ప్రమాదాలు. రేసింగ్ అన్నాక.. యాక్సిడెంట్స్ కామనే అయినా.. ఏర్పాట్లలో పొరబాట్ల వల్లే ప్రమాదాలు జరగడంతో ఏకంగా ఇండియా రేసింగ్ లీగ్ నే రద్దు చేశారు నిర్వాహకులు.


హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇండియా కార్‌ రేసింగ్‌ లీగ్‌ అర్థాంతరంగా నిలిచిపోయింది. శనివారం టెస్ట్‌ రేస్‌లు జరగ్గా.. ఆదివారం సమయం సరిపోక, చీకటిపడటంతో రేసులు క్యాన్సిల్ చేశారు. లీగ్‌ నిర్వహణకు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండడం.. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఆలస్యం కారణంగా ప్రధాన రేసింగ్‌ నిలిచిపోయింది. దీంతో ఇండియా రేసింగ్‌ లీగ్‌ను రద్దు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు.

ఆదివారం కార్ రేసింగ్‌లో ఐదు ప్రమాదాలు జరిగాయి. ఒక మహిళా రేసర్‌కు గాయాలవటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా నాలుగు ప్రమాదాల్లోనూ రేసర్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కొన్ని కార్లు డ్యామేజ్ అయ్యాయి.


అంతర్జాతీయ ప్రమాణాలతో రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని చెప్పింది తెలంగాణ సర్కారు. అయితే, శనివారం రేసింగ్ జరుగుతుండగా చెట్టు కొమ్మ విరిగి కారుపై పడింది. రేసర్ అలర్ట్ గా ఉండటంతో డ్యామేజ్ తప్పింది. ఇంత పెద్ద ఈవెంట్ లో చెట్టు కొమ్మ విరగి పడటం అనేది చిన్న విషయమైతే కాకపోవచ్చు.

ఇక ఆదివారం మరో ఐదు ప్రమాదాలు. ఎన్టీఆర్ మార్గ్‌లోని మూల మలుపు దగ్గర అదుపు తప్పి రెండు కార్లు ఢీకొన్నాయి. చెన్నై టర్బోరైడర్స్ టీమ్‌కు చెందిన మహిళా రేసర్ ప్రమాదానికి గురవడం కలకలం రేపింది. మూల మలుపు దగ్గర యాక్సిడెంట్ కావడంతో ట్రాక్ నిర్మాణంలో టెక్నికల్ లోపాలేమైనా ఉన్నాయా? అనే అనుమానం. వరుస ప్రమాదాలు, సమయాభావంతో లీగ్ ను రద్దు చేశారు. ప్రధానమైన ఫార్ములా ఈ రేసింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×