BigTV English

Indiramma Houses : ఇకపై అవినీతికి నో ఛాన్స్.. ఏఐతో అన్ని కనిపెడతాం జాగ్రత్త అంటున్న రాష్ట్ర సర్కార్

Indiramma Houses : ఇకపై అవినీతికి నో ఛాన్స్.. ఏఐతో అన్ని కనిపెడతాం జాగ్రత్త అంటున్న రాష్ట్ర సర్కార్

Indiramma Houses : 


⦿ నిర్మాణాల పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
⦿ దరఖాస్తుల వివరాలను పోల్చి చూసే ఆలోచన
⦿ పనుల పురోగతిపై మొబైల్ యాప్‌‌‌లో అప్‌డేట్స్
⦿ ప్రతీ ఇంటికి జియో ఫెన్సింగ్ కో – ఆర్డినేటర్లు
⦿ మోడల్ ప్రకారం కట్టిన వివరాల ఆధారంగా నిధులు

స్వేచ్ఛ తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో అవకతవకలను నివారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని గృహనిర్మాణ కార్పొరేషన్ వినియోగించనున్నది. లబ్ధిదారుల ఎంపిక మొదలు చివరి దశలో పూర్తయ్యే నిర్మాణాన్ని పరిశీలించి నిధులను విడుదల చేసేంత వరకు ఈ టెక్నాలజీని వాడుకోనున్నది. దరఖాస్తుదారులు ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన వివరాల ఆధారంగా ఏఐ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసే అంశాలను పోల్చి చూడాలని భావిస్తున్నది. రూపొందించిన మోడల్‌కు అనుగుణంగా ఉన్నదో లేదో చూసి బిల్డర్ల(థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లు)కు నిధులను గృహనిర్మాణ కార్పొరేషన్ విడుదల చేయనున్నది.


క్షేత్రస్థాయిలో సర్వేయర్ల మొదలు ప్రభుత్వ సిబ్బంది వరకు ఇచ్చే ఇన్‌పుట్స్, మొబైల్ యాప్‌లో ఇండ్ల నిర్మాణ పురోగతి తదితరాలను ఛాయాచిత్రాల ఆధారంగా జియో కోఆర్డినేటర్ల వివరాలను బేరీజు వేసుకుని లోపాల్లేకుండా వ్యవహరించే ఉద్దేశంతో కొత్త సాఫ్ట్ వేర్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జోడించనున్నది. ఇంటి నిర్మాణానికి అనుగుణంగా విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నందున ప్రజా ధనం దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరించనున్నది.

పనితీరు ఎలా ఉండబోతోందంటే!

దరఖాస్తుల్లోని వివరాల ఆధారంగా సర్వేయర్లు పాతి ఇంటిని లేదా స్థలాన్ని పరిశీలించి జియో కోఆర్డినేట్స్ మొదలు అన్ని వివరాలను సేకరించనున్నారు. వీటిని మొబైల్ యాప్‌లో పొందుపరుస్తారు. ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేసే సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానమై ఉంటున్నందున ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి. లబ్ధిదారులు పేర్కొన్న చిరునామా ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతున్నదా? పునాది నుంచి శ్లాబ్ లేదా రేకుల పైకప్పు వరకు మోడల్ ప్రకారమే ఉన్నదా? ఎంపికైన లబ్ధిదారులకు చెందిన ఇండ్లేనా? ఇలాంటి అంశాలను ధృవీకరించుకోడానికి ఒకవైపు క్షేత్రస్థాయి సిబ్బంది ఇచ్చే వివరాలు, మరోవైపు మొబైల్ ద్వారా తీసుకున్న ఫోటోలను మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం, వాటి జియో ఫెన్సింగ్ కో – ఆర్డినేట్స్ సరిపోతున్నాయా? ఇలా మొత్తం నాలుగు దశల్లో ఏఐ టెక్నాలజీ పరిశీలిస్తుంది.

ఇంటి అవసరాల కోసం జరుగుతున్న నిర్మాణమో కాదో కూడా వివిధ కోణాల్లోంచి సిబ్బంది తీసే ఫోటోల ఆధారంగా సాఫ్ట్‌వేర్ నిర్ధారిస్తుంది. ఈ ఫోటోలను ఎలా తీయాలో నిర్దిష్టమైన అవగాహనను సిబ్బందికి శిక్షణ ద్వారా ఉన్నతాధికారులు అందజేస్తారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఇండ్ల నిర్మాణం పారదర్శకంగా జరగడం, లబ్ధిదారులకు న్యాయం జరగడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడడం, ప్రభుత్వ పథకం పక్కదారి పట్టకుండా చెక్ పెట్టడం, టార్గెట్ ప్రకారం వేగవంతంగా నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయడం, ఇలా బహుళ ప్రయోజనాలను ఉద్దేశించి గృహనిర్మాణ శాఖ ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి శ్రీకారం చుడుతున్నది.

అన్నీ పక్కాగా ఉండేలా ప్లాన్

ఇండ్ల నిర్మాణంతో సంబంధం ఉన్న వివిధ విభాగాల అధికారులు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలుసుకోడానికి ఏఐ టెక్నాలజీ దోహదపడనున్నది. అవసరమైన అనుమతులు ఇవ్వడం మొదలు లబ్ధిదారులకు వీలైనంత వేగంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఇవ్వడం ఈ ప్రక్రియలో కీలకమైన భాగం. దరఖాస్తులు వచ్చిన వెంటనే ఆ స్థలాన్ని లేదా పాత ఇంటిని గుర్తించడం, పునాది మొదలు శ్లాబ్ లేదా రేకుల పైకప్పు వరకు, ఇంటి గోడలు, ఇంటి విస్తీర్ణం, ఖాళీ స్థలం, అప్రూవ్ చేసిన డిజైన్, ఇలా అన్నింటినీ ఈ సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది.

ఒక్కో అంశాన్ని గుర్తించడానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలని గృహనిర్మాణ శాఖ భావిస్తున్నది. ఇలాంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఫీల్డ్ స్టాఫ్ మొబైల్ యాప్‌లో పొందుపరిచే వివరాల ఆధారంగా సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ అవుతాయి. దీంతో ఏ గ్రామంలో ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, లబ్ధిదారుల వివరాలు, ప్రస్తుతం నిర్మాణం ఏ దశలో ఉన్నదో తెలుస్తుంది. వీటికి అనుగుణంగా గృహనిర్మాణ శాఖ ఎంత మొత్తంలో బిల్డర్ (కాంట్రాక్టర్)కు నిధులు విడుదల చేయాలో విధాన నిర్ణయం తీసుకుంటుంది.

Also Read :  అల్పపీడనం ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

కేవలం డబ్బుల కోసమే ఇంటి నిర్మాణం చేసినట్లు నమ్మించి గృహావసరాలకు బదులుగా ఇతరాలకు వినియోగించే తప్పుడు విధానాలకు చెక్ పెట్టడానికి వెసులుబాటు లభిస్తుంది. ఒక్కో దశలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను ఏ కోణం నుంచి ఎలా తీయాలో, సాఫ్ట్‌వేర్‌కు పనికొచ్చేలా మొబైల్ యాప్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం ఏఐ టెక్నాలజీ వినియోగంలో ఒక భాగం.

Related News

Weather News: బంగాళఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Hyderabad News: హైదరాబాద్‌ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. సిబ్బందిపై దుండగులు కాల్పులు, పలువురికి గాయాలు?

ORR Closed: వాహనదారులు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ORR సర్వీసులు బంద్

Big Stories

×