E-Paper
Advertisement

ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసులో బిగ్ బ్లాస్ట్.. డైరెక్టర్, ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అరెస్ట్!

ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసులో బిగ్ బ్లాస్ట్.. డైరెక్టర్, ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అరెస్ట్!
Advertisement

Oasis Fertility Case: సరూర్‌నగర్ అక్రమ అండాల సేకరణ కేసులో మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించిన తాజా వివరాలు చూస్తుంటే వ్యవహారం ఎంత పెద్దదో అర్థమవుతోంది. ఓయాసిస్ ఫెర్టిలిటీని నిర్వహిస్తున్న సద్గురు హెల్త్‌కేర్ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒయాసిస్ ఫెర్టిలిటీ డైరెక్టర్ మేషనను కూడా అరెస్ట్ చేయడం గమనార్హం.

కీలక అరెస్టులు, పాత్రలు

Advertisement

ఈ కేసులో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రతిక్ అనిల్ గగ్లానీ (COO, A-8), డాక్టర్ రాజర్షి దేబ్ (మెడికల్ అడ్మినిస్ట్రేటర్, A-9)లను సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వాంగ్మూలాలు నమోదు చేశారు. వైద్య పరికరాల కొనుగోలు, నిధుల సమన్వయం, డాక్టర్ల నియామకంలో వీరు కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక పారితోషికం, ఆర్థిక ప్రయోజనాల కోసమే వీరు సహకరించినట్లు విచారణలో తేలింది. వీరిలో COOకి నెలకు రూ.4.20 లక్షలు, మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌కు రూ.3.60 లక్షల వేతనం అందుతున్నట్లు గుర్తించారు.

దాతల సమీకరణ, కార్యకలాపాలు

Advertisement

వేరే రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా మహిళలను హైదరాబాద్‌కు రప్పించి, హార్మోన్ ఇంజెక్షన్లతో అండాల ఉత్పత్తిని ప్రేరేపించినట్లు ఆరోపణలున్నాయి. వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ గెడెల దుర్గారావు సూచనలతో ఏజెంట్లు పనిచేసినట్లు సమాచారం. మియాపూర్ ART బ్యాంక్ ఇన్‌చార్జ్ సునీల్ రాయ్ ద్వారా దాతల సమీకరణ జరిగిందని, వీరితో ఎగ్జిక్యూటివ్‌లు సమన్వయం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లలో నాలుగు లెవల్-II IVF కేంద్రాలు ఉండగా, దేశవ్యాప్తంగా ఉన్న 43 క్లినిక్‌లలో నెలకు దాదాపు 600 సెల్ఫ్ సైకిళ్లు, 100 ఓసైట్ డోనర్ సైకిళ్లు జరుగుతున్నట్లు వెల్లడైంది.

ఆర్థిక లావాదేవీలు, దర్యాప్తు

సంస్థ నెలవారీ ఆదాయం సుమారు రూ.27–28 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు గుర్తించారు. వాంగ్మూలాల్లో వేర్వేరు ఆదాయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26, 2026 వరకు HDFC ఖాతాలో భారీగా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితుల నుంచి మూడు ఐఫోన్‌లను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

Also Read: డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ డబుల్ గేమ్.. కేసీఆర్‌ను ఉతికారేసిన అద్దంకి!

Tags

Related News

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలను నీటి పంపులో తోసేసిన తల్లి!

గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు.. తెలంగాణ మోడల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ డబుల్ గేమ్.. కేసీఆర్‌ను ఉతికారేసిన అద్దంకి!

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. ఒకే ఇంట్లో 70 తులాల బంగారం మాయం!

కేపీహెచ్‌బీలో విషాదం.. కార్తిక దీపం అంటుకుని యువతి మృతి

రేవంత్, రాహుల్ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు: రాంచందర్ రావు

ప్రతి 17 గంటలకో బాల్య వివాహం.. తెలంగాణలో షాకింగ్ గణాంకాలు.. రంగంలోకి పోలీస్ శాఖ!

Big Stories

Advertisement
×