Shobhita dhulipala..అక్కినేని కొత్త కోడలు, నాగ చైతన్య (Naga Chaitanya) భార్య శోభిత ధూళిపాళ్ల(Shobhita dhulipala) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్లో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. వాస్తవానికి తెలుగమ్మాయి. కానీ ఇక్కడ ప్రయత్నాలు చేయకుండా బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. నాగచైతన్యతో ఎప్పుడైతే ప్రేమలో పడిందో అప్పటినుంచి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అందులో భాగంగానే నాగచైతన్యతో వివాహం తర్వాత మరింతగా వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడు వివాహం తర్వాత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోవాలని ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన డైరెక్టర్ తో సినిమా చేయడానికి అవకాశం అందుకున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
లక్కీ ఛాన్స్ కొట్టేసిన అక్కినేని కొత్త కోడలు..
ఆయన ఎవరో కాదు ప్రముఖ సంచలన డైరెక్టర్ పా.రంజిత్ (Pa.Ranjith). ఇకపోతే పెళ్లయిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన శోభిత ఇప్పుడు మళ్లీ బిజీ అవ్వడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా సినిమాలు, కథ, పాత్ర చాలా భిన్నంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటోంది. ఈ క్రమంలోనే పా.రంజిత్ డైరెక్షన్లో చేసే సినిమా చాలా వినూత్నంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే పా.రంజిత్ విషయానికి వస్తే.. ఆయన సినిమాలు, కథ, నటీనటుల వేషధారణ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉదాహరణకు ‘తంగళాన్’ సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది.అందులో హీరోయిన్లను ఆయన ఎలా చూపించాడో కూడా మనకు తెలిసిందే.
పా రంజిత్ దర్శకత్వంలో శోభిత..
ప్రస్తుతం ఈయన ‘వెట్టువన్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు దినేష్ హీరోగా చేస్తుండగా.. ఆర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తర్వాత వీరి కాంబోలో వస్తున్న రెండవ చిత్రమిది. ఇందులో హీరోయిన్గా శోభితాను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక పా. రంజిత సినిమాలో హీరోయిన్ లుక్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుందని కూడా ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇదే జరిగితే పెళ్లి తర్వాత ఆమెకు అదృష్టం కలిసి వచ్చినట్టే అని చెప్పవచ్చు.
పెళ్లి తర్వాత నాగచైతన్యకు కలిసొచ్చినట్టే..
ఇకపోతే ఇప్పటికే శోభితా కారణంగా నాగచైతన్యకు భారీగా అదృష్టం కలిసి వచ్చిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు నాగచైతన్య. అప్పటివరకు సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈయనకు ఈ సినిమా మంచి ఊరట కలిగించింది. అంతేకాదు తన డ్రీమ్ రెస్టారెంట్ అయినా షో యు కూడా ఇటీవలే ప్రారంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రత్యేకమైన వంటలను ఇక్కడ మనం రుచి చూడవచ్చు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ షో యు రెస్టారెంట్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తనకు ఎప్పుడైనా జపాన్ ఫుడ్ తినాలనిపిస్తే ఇక్కడికి వస్తానని, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని కూడా తెలిపారు. ఇలా మొత్తానికైతే శోభిత వల్ల నాగచైతన్యకు బాగా కలిసి వచ్చింది. మరి శోభిత పరిస్థితి ఏంటో చూడాలి.