Jain International Residential School Scholarship Program: బెంగళూరుకు చెందిన జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్(జేఆర్ఐఎస్), ది స్పోర్ట్స్ స్కూల్ సహకారంతో దేశంలో తొలి ఇంటిగ్రేటెడ్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభంకానుంది. ఈ నెల 25న 8 మెట్రో నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్యాడ్మింటన్ లెజెండ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, టెన్నిస్ క్రీడాకారుడు పద్మశ్రీ రోహన్ బోపన్న, క్రికెట్ ఐకాన్ రాబిన్ ఉతప్ప ఈ వేడుకలకు మెంటార్లుగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా మొదటి వేడుకను తాజాగా సికింద్రాబాద్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో ఏర్పాటు చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందన్నారు. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో క్రికెట్ గా బాగా రాణించిన, అవకాశాలు తక్కువగా ఉండడంతో ఆ వైపు వెళ్లలేకపోయారని అన్నారు. అటు జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటుచేసి పాతికేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జెఎన్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చెన్రాజ్ రాయిచంద్ తెలిపారు. విద్యతోపాటు చదువులో రాణించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనకబడి ఉన్న విద్యార్థులకు మేలు కలగనుందన్నారు.
Read Also: కేసీఆర్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి..? మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
ఇక ఈ నెల 25న జరిగే జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌షిప్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జేయారెస్ పూర్వ విద్యార్థులతోపాటు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సీనియర్ కోచ్ అనిల్ కుమార్ తదితరులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Read Also: మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. ఆ ఆరోపణలపై సృజన్ రెడ్డి సీరియస్