E-Paper
Advertisement

Karimnagar News : డ్యాన్స్ చేస్తూ గుండెపోటు.. ఇంటర్ స్టూడెంట్ దుర్మరణం..

Karimnagar News : డ్యాన్స్ చేస్తూ గుండెపోటు.. ఇంటర్ స్టూడెంట్ దుర్మరణం..
Advertisement
Karimnagar News

Karimnagar News : కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తి.. స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించగా.. అందులో పాల్గొన్న ప్రదీప్తి సందడి చేసింది.

Advertisement

స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతూ ఆడిపాడింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. కళాశాలలోని లెక్చరర్లు ఆమెకు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

కన్నబిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లముందే ప్రదీప్తి కుప్పకూలి, చావు బతుకులతో పోరాడడంతో స్నేహితులంతా తల్లడిల్లిపోయారు. సుదీప్తికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం ఉంది. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు.. తల్లిందండ్రులకు ముందే సూచించారు. అయితే ఆపరేషన్ చేయించే స్తోమత లేకపోవడంతో.. ఇప్పుడిలా ప్రాణాలు విడిచింది ప్రదీప్తి.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×