E-Paper
Advertisement

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..
Advertisement

Principal Murder: హత్యకు ముందు రూపారెడ్డి గారు తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో చివరిగా “బాబు” అని పలికారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో, “ఆమె చివరిగా బాబు అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు?” అనే ప్రశ్న పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.ఈ కోణంలో విచారణ చేపట్టగా, రూపారెడ్డి గారు తన పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా “బాబు” అని పిలిచేవారని పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో దర్యాప్తు పాఠశాల విద్యార్థుల వైపు మళ్లింది.ప్రిన్సిపల్ మరణానికి సంతాప సూచకంగా పాఠశాలకు వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులను విచారించడంలో కొంత ఆలస్యం జరిగింది. పాఠశాల పునఃప్రారంభమైన అనంతరం పోలీసులు విద్యార్థులను ఒక్కొక్కరిని సున్నితంగా విచారిస్తూ దర్యాప్తును కొనసాగించారు.

పాఠశాలకు హాజరుకాని విద్యార్థులు..

ఈ క్రమంలో రెండు రోజులుగా పాఠశాలకు హాజరుకాని కొంతమంది విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారిలో అయిదుగురు విద్యార్థులు కొత్తగా జల్సాలకు అలవాటు ఐనా వారిపై ప్రత్యేక దృష్టి సాదించినారు. నేరస్థలంలో లభించిన సి‌సి‌టి‌వి ఫూటేజ్ లు అనుమానిత విద్యార్థులతో సరిపోలడంతో వారిపై ప్రత్యేక దృష్టి సారించి నేరానికి పాల్పడినది సదరు విద్యార్దులే అని పోలీసులు నిర్దారించుకున్నారు.

నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ పాఠశాల

Advertisement

నిందితులు ఇద్దరూ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ పాఠశాల నందు 10 తరగతి చదువుతు హాస్టల్ నందు ఒకే గదిలో ఉంటున్నారు. వీరు జల్సాలు, చెడు వ్యసనలకు అలవాటుపడి హాస్టల్ గదులలో వారి తల్లి తండ్రులకు తెలియ కుండ సెల్ ఫోన్ లు వినియోగిస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్ లలో డబ్బులు తేలికగా ఏలా సంపాదించాలి అని వెతుకెవారని పోలీసుల తనికీలో బైటపడింది.

Also Read: పేదలకు బంపరాఫర్.. రూ.200కే వజ్రాల గని లీజు.. ఒక్క రోజులో కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

ప్రిన్సిపల్ పై కక్ష..

Advertisement

గతనెలలో వీరిద్దరు హాస్టల్ లో డబ్బులతో ప్రికిపాల్ కి దొరుకుతారు అట్టి విషయం లో ప్రిన్సిపల్ వారియొక్క తల్లి తండ్రుల సమక్షంలో మందలించగ ఇట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకుంటారు., ప్రిన్సిపల్ రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని భావించి సోషల్ మీడియాలో ఆదారాలు దొరకుండా హత్యపై అన్వేషనా చేసి హత్యకు పాల్పడి నగదును అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

డబ్బుకోసం హత్య..

డబ్బుకోసం రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని, ఎవరైనా వస్తున్నారా అని ఒకరు గమనిస్తుండగా మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి అప్పటికే తెరిచి ఉన్న వంటగది ద్వారా ఇంట్లోకి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న 2.50 లక్షల నగదును తీసుకుని ఇంటి వెనుక గోడ దూకి నిర్మానుష్య ప్రాంతం నుంచి వెళ్లిపోయి, కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్‌ఫోన్‌ను చెట్ల పొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు.

Also Read: సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

Tags

Related News

 KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?

రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

Big Stories

Advertisement
×