CP Sajjanar: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలవుతున్న వన్‌వే ట్రాఫిక్ నిర్వహణ పనితీరుపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ బైక్‌పై ఆయనే స్వయంగా తిరిగి క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును వాహణరాకపోకలను స్వయగా వెల్లి పరిశీలించారు. సజ్జనార్‌తో పాటు అదనపు సీపీ శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ జాయింట్ సీపీ, ఎస్.ఎమ్.విజయ్ కుమార్, ఐపీఎస్‌లతో కలసి ఈ పర్యటన చేపట్టారు.
ఈ క్రమంలో ఫిల్మ్‌నగర్‌లో ఉన్న రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం, ముగ్ధ, బసవతారకం, అగ్రసేన్ జంక్షన్ల మీదుగా బైక్ పై ప్రయాణిస్తూ వాహనాల రాకపోకలు మరియు ట్రాఫిక్ నియంత్రణ పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. రోడ్లపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై క్షేత్రస్థాయిలో అధికారులకు తగు సూచనలు చేశారు.
Also Read: తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు
రోడ్లపై ట్రాఫిక్ సమస్యల నివారణకు, ప్రయాణికులు సాఫీగా వెల్లేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సజ్జనార్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ ట్రాఫిక్ శ్రీ డి.జోయల్ డేవిస్, ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్ శ్రీమతి కాజల్ సింగ్, ఐపీఎస్ ముఖ్య అధికారులు పాల్గోన్నారు.
Also Read: ఈడీ అధికారుల ఎదుట నిధి అగర్వాల్.. ఆ ప్రశ్నలు అడగనున్నారా?