E-Paper
Advertisement

KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో జరిగిన భూసేకరణ అక్రమాలపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ జాగృతి సంస్థ ఎప్పుడూ పనిచేసిందని ఆమె గుర్తు చేశారు.

ఉద్యమ సమయంలో సంస్కృతి పండుగలు కాపాడేందుకు బతుకమ్మ బోనాలు ఎత్తుకొని పోరాటం చేశామన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మానవ వనరుల అభివృద్ధి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధనలో జాగృతి కృషిని వివరించారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. యువకులు మహిళలు బ్యాక్ గ్రౌండ్ లేని యువతకు రాజకీయ అవకాశాలు ఆర్థిక సామాజిక అవకాశాలు దక్కాలని ఆమె ఆకాంక్షించారు.

రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా శేరిలింగంపల్లి రాజేంద్రనగర్ మహేశ్వరం నియోజకవర్గాల్లో చెరువుల కబ్జాలు అధికంగా జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) అధికారులు పెద్దలను రక్షించి పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కబ్జాల వివరాలు హైడ్రాకు అందిస్తాం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) అలైన్‌మెంట్‌ను సీఎం మంత్రులు బీఆర్ఎస్ నేతల భూముల కోసం మార్చడం పేద రైతులకు అన్యాయం చేయడమేనని ఆమె పేర్కొన్నారు. బాధితులందరితో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తానని ముందుగా లేఖ కూడా రాస్తానని తెలిపారు. అశాస్త్రీయంగా ప్రాజెక్టును చేపడుతున్నారు మళ్లీ రీ సర్వే చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒరిజినల్ ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని కోరారు.

రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో ముందున్నా ఇక్కడి స్థానిక ప్రజలకు ఉద్యోగాలు ప్రాజెక్టుల ఫలాలు అందటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాబ్ సిటీ ఫ్యూచర్ సిటీ లాంటి పెద్ద ప్రాజెక్టులు ఇక్కడికే వచ్చినా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. కంపెనీలు వచ్చినప్పుడు స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు కల్పిస్తారో అడగాలని సూచించారు. నాయి బ్రాహ్మణులు రజకులకు ఫ్రీ కరెంట్ ఇవ్వకపోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వమని తేలిపోయిందన్నారు. లక్ష్మి దేవరపల్లి ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫార్మా కంపెనీలు పెట్టకపోతే తిరిగి రైతులకు వాపస్ ఇవ్వాలని లేదంటే కోర్టుకు వెళ్తామని కవిత హెచ్చరించారు. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలు అని పేరు పెట్టడం ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే అన్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డలను అవమానించడమే అని పేర్కొన్నారు. మహిళల సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటామని రూ.2500 కోసం పోరాటం చేస్తామని తెలిపారు. జనం బాట కేవలం ఆరంభం మాత్రమే తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×