BigTV English

KCR Delhi Tour: BJP తో స్నేహానికి KCR చలో డిల్లీ టూర్!

KCR Delhi Tour: BJP తో స్నేహానికి KCR చలో డిల్లీ టూర్!
kcr latest news

KCR Delhi Tour Plan: మోడీతో స్నేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నయా ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి.. ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్లు సమాచారం. అందుకోసం పీఎం మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్ మెంట్ కూడా అడినట్లు విశ్వసనీయ సమాచారం. రెండుమూడ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిసింది.


ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లనున్నట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ బీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. ఎందుకు వెళ్తున్నారు? అసలు వెళ్లాల్సిన అవసరం ఏముందనే ప్రచారం జరుగుతుంది. ఇన్నిరోజులు మోడీని కలిసేందుకు మొగ్గుచూపని కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు ఆసక్తి చూపుతున్నారనేది ఆసక్తి నెలకొంది. 2022 ఫిబ్రవరి 5న చిన్నజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు పీఎం మోడీ హాజరయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.

Read More : మూసీ ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వచ్చిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఅర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు సైతం పార్టీ మారేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తరుణంలోనే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత హస్తం గూటికీ చేరారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రజల్లో సైతం బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో వ్యతిరేకత తగ్గలేదని గ్రహించినట్లు సమాచారం. రామమందిరంలో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు ఉన్నాయని, పొత్తుతో గట్టెక్కవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుండటం బలం చేకూర్చుతున్నాయి. పొత్తు ఒకవేళ కుదరకపోతే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న లోక్ సభ స్థానాల్లో బీజేపీకి పరోక్షంగా సహకారం అందజేస్తామని హామీని ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది.

Read More : వృద్ధుడి కామవాంఛకు చిన్నారి బలి.. జూబ్లిహిల్స్ బాలుడి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

ఇప్పటికే కవితపై లిక్కర్ కేసు, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచడం, మరోవైపు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. వాటన్నింటినుంచి తప్పించుకునేందుకే కేంద్రంలోని బీజేపీ సహకారం కోసం వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు కేసీఆర్ తో పాటు బీఅర్ఎస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

నాడు పీఎం మోడీపై తిట్లదండకం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్రంలోని బీజేపీ పాలనపైనా విమర్శలు గుప్పించారు. మోడీని తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. మోడీది మతపిచ్చి ప్రభుత్వం అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ఆపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, అన్నిలోక్ సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామని పేర్కొంటున్నారు.

ఇదే పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఒకరిద్దరు మనహా మిగతావారు నోరుమొదపడం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబుతున్నారని గమనిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పోత్తుపై చర్చిస్తారా? ఒకవేళ పొత్తుంటే తమపరిస్థితి ఏంటి? అనేది ఆపార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగబోతుందని రాజకీయ వేత్తలు, పలుపార్టీ నేతల్లోనూ కేసీఆర్ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×