BigTV English

Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు.. షార్ట్ నోటిఫికేషన్ విడుదల

Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు.. షార్ట్ నోటిఫికేషన్ విడుదల
RRB Technician Recruitment 2024

RRB Technician Recruitment 2024: రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి, నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువులను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో మొత్తం 9000 మంది టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ లోగా.. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


అభ్యర్థులను రాతపరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://indianrailways.gov.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు.

ఆర్ఆర్ బీ నోటిఫికేషన్ ప్రకారం.. అహ్మదాబాద్, అజ్ మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్ పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్ కతా, మాల్దా, ముంబై, ముజఫర్ పూర్, పట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్ పూర్ తదితర రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత, రాతపరీక్ష, సిలబస్ తదితర వివరాలను త్వరలో విడుదల చేస్తారు.


Read More: బాబోయ్ ఎండలు.. కేరళలో ఎల్లో అలర్ట్..!

మొత్తం పోస్టులు

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు – 1,100
టెక్నీషియన్ గ్రేడ్ -III పోస్టులు – 7,900

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టుల్ని బట్టి మెట్రిక్యులేషన్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయసు 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ – III పోస్టులకు అభ్యర్థుల వయసు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి.

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు జీతం రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు జీతం రూ.19,900 ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, మాజీ సైనిక ఉద్యోగులు, ఈబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250, ఇతరులకు రూ.500గా ఫీజు నిర్ణయించారు.

ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

మార్చి 9వ తేదీ నుంచి దరఖాస్తులు మొదలవుతాయి. ఏప్రిల్ 8న దరఖాస్తులకు చివరితేదీ.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×