BigTV English

IT Raids : అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిలో ఐటీ సోదాలు.. తాళాలు పగలగొట్టి హంగామా

IT Raids : అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిలో ఐటీ సోదాలు.. తాళాలు పగలగొట్టి హంగామా
IT Raids in Telangana

IT Raids in Telangana(Latest news in telangana):

అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ నివాసంలో ఆదివారం అర్ధరాత్రి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలంపూర్‌లోని శాంతినగర్‌లో గల సంపత్‌ కుమార్‌ నివాసానికి ఒక్కసారిగా పోలీసులు, ఐటీ అధికారులు చేరుకున్నారు. సంపత్‌ కుమార్‌ ఇంట్లో గదికి తాళాలు వేసి ఉండగా.. వాటిని బద్దలుకొట్టి లోనికి చొరబడి సోదాలు నిర్వహించారు. బెడ్‌రూంలో బీరువాలో ఉన్న బట్టలు మొత్తం చెల్లాచెదురుగా వేశారు. బెడ్‌ కింద నుంచి చిన్న చిన్న బ్యాగులను తనిఖీ చేశారు. ఐటీ అధికారులు సోదాల్లో సంపత్‌ నివాసం ఎలాంటి నగదు, బంగారం వంటివి ఎలాంటివి దొరకలేదు. ఐటీ సోదాల సమయంలో సంపత్‌కుమార్‌ ఇంట్లో లేకపోవడంతో.. కుటుంబ సభ్యులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. తక్షణమే సంపత్‌కుమార్‌ను ఇక్కడికి పిలిపించాలని ఆదేశించారు. లేదంటే హైదరాబాద్‌ నుంచి మరిన్ని ఐటీ బృందాలు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు.


ఐటీ అధికారులు, పోలీసులు తీవ్ర భయాందోళనకు గురి చేయడంతో సంపత్‌కుమార్‌ సతీమణి మహాలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేసి మహాలక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. అంతలోనే తన నివాసానికి చేరుకున్న సంతప్‌కుమార్‌..పోలీసుల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళలు ఉంటారని కూడా చూడకుండా మహిళా సిబ్బంది లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. ఇంట్లోకి చొరబడి మహిళలను కూడా చూడకుండా భయబ్రాంతులకు గురి చేసి.. దాడి చేయడమేంటన్నారు.

తనిఖీ చేసే సమయంలో కనీసం మహిళ సిబ్బంది కూడా లేకుండా ఇంట్లోకి చొరబడిన అధికారులు..సంపత్‌కుమార్‌ కుటుంబ సభ్యులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. కనీసం మహిళా సిబ్బంది లేకుండా మహిళలు ఉన్న ఇంట్లోకి అధికారులు ఎలా ప్రవేశిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు లాఠీలు, గన్‌లతో రావాలి కానీ..సంచులతో రావడం ఏంటి..ఆ సంచులు ఎందుకు తీసుకొచ్చారని సంపత్‌కుమార్‌ ప్రశ్నించారు .


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×