Illu Illalu Pillalu ToIlluday Episode August 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం, ఆనందారావు వెళ్తుంటే వెనకాలే ప్రేమ, నర్మదలు ఫాలో అవుతారు. ఎలాగైనా సరే ఈరోజు వీళ్ళ బండారం బయటపెట్టాలని అనుకుంటారు. వీళ్ళు ఇద్దరు కారులో వచ్చామని ఇలా పాత డొక్కు స్కూట మీద వచ్చారు చూసావా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. ఆనందరావుకే ఎదురుగా ఒక బండ తినడంతో అతనితో గొడవకు దిగుతాడు. బండి అద్దం నుంచి నర్మద ప్రేమ కనిపించడం చూసి భాగ్యం అనుమానాన్ని ఫాలో అవుతున్నారు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటారు. స్కూటర్ ను అక్కడ పడేసి సంధులు గొందులలో పరుగులు పెడతారు. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళని వెతికే ప్రయత్నంలో ఉంటారు. ప్రేమ నర్మదలు ఇద్దరూ ఎంత వెతికినా సరే భాగ్యం ఆనందరావు కనిపించకపోవడంతో ఈరోజు తప్పించుకున్నారు. ఏదో ఒక రోజు దొరకపోతారని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చందు దిగాలుగా కూర్చోవడం చూసి సాగర్ ధీరజ్లు ఏమైందిరా అలా ఉన్నావు ఏదో బాధ పడుతున్నట్లు ఉన్నావే అని అడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ ఒక్కటే నడుచుకుంటూ రావడం చూసి ధీరజ్ ఒకటే నడుచుకుంటూ వస్తుందే సైకిల్ మీద ఎలాగైనా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని అనుకుంటాడు.. నీ ప్రేమ మాత్రం ఈరోజు డ్రాప్ చేస్తానంటావు. రేపు నువ్వు నాకు ఇంట్లో వస్తువుతో సమానం అని అంటావు ఎందుకు వచ్చిందిలే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అంటుంది. సాగర్ నీ పరిస్థితి కూడా ఇంతేనా రా అని అంటాడు.. ధీరజ్ మాత్రం ప్రేమని నువ్వు అలా ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే నాకు బాధగా అనిపిస్తుంది రా డ్రాప్ చేస్తానని బతిమిలాడతాడు. దానికి ఒప్పుకున్న ప్రేమ నేను సైకిల్ మీద కూర్చుంటాను..
నువ్వు నన్ను ఎక్కించుకొని నడుచుకుంటూ తోసుకుంటూ రావాలి అని అంటుంది. ఇక ప్రేమ కోసం తప్పక అలా పని చేస్తాడు ధీరజ్. సాగర్ నర్మద దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరిస్తాడు. కాని నర్మద మాత్రం సాగర్ ని చూసి కూడా చూడనట్టే ఉంటుంది.. సాగర్ బ్రతిమలాడుతూ ఉంటే నర్మదా అతని ఎవరో తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తుంది. అక్కడే ఉన్న ఒక ఆవిడా ఆడపిల్లల్ని ఏడిపిద్దాం అనుకుంటున్నావ్ రా అని కొట్టబోతుంది. అయితే సాగర్ నేను ఆవిడ భార్యాభర్తలమే చెప్పవే అని బ్రతిమలాడుతాడు. కాలు పట్టుకోవడం వల్లే చివరికి నర్మదా ఒప్పుకుంటుంది..
ఆనందరావు బయటికి వెళ్తే ఎక్కడ నర్మదా పట్టుకుంటుందో అని దొంగలాగా బయటకి తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శ్రీవల్లి వచ్చి కనిపిస్తుంది. ఏమైందమ్మా నేను ఇంట్లోంచి గెంటేసారా అప్పుడే వచ్చేసావ్ ఏంటి అని అంటాడు. శ్రీవల్లి కోపంగా లోపలికి వచ్చి అక్కడ ఉన్న వస్తువులని పగలగొడుతుంది. ఇప్పటికన్నా 10 లక్షలు ఇవ్వకపోతే నేను శాశ్వతంగా ఇక్కడే ఉండి పోవాల్సింది అని అంటుంది.. కానీ శ్రీవల్లి తాళాలను చూసిన ఆనందరావు నేను దొంగగా వస్తాను నువ్వు ఆ తాళాలు నాకు ఇచ్చేయ్ పది లక్షలు కొట్టేసి ఇచ్చేద్దామని అంటాడు.
Also Read : భానుమతికి దెయ్యం పట్టిందా? కమల్ ప్లాన్ రివర్స్.. అక్షయ్ ప్రణతిని మారుస్తాడా..?
ఈ విషయం గనుక మా ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి అంతే అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది. ఇక రామరాజు కోసం వేదవతి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది.. రామరాజు శ్రీవల్లి కోసం ఎదురు చూస్తాడు. రామరాజుతో శ్రీవల్లి పిచ్చిదాని లాగా మాట్లాడుతూ ఉంటుంది.. రామరాజు మాత్రం మాట్లాడడానికి మాటలు ఏమున్నాయో అని అంటాడు.. మాట్లాడ్డానికి మాటలు ఏముంటాయి ఏం మాట్లాడుతున్నారండి అని బాధపడుతుంది వేదవతి. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరుగా మారతారుగా.. నమ్మకం కరువైతే మాటలు కూడా బరువు అయితే అని రామరాజు భేదవతిని బాధపడేలా చేస్తాడు. వేదవతి బాధపడడం చూసిన కోడలు ఇద్దరు ఎంత బాధపడుతుందో అని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…