Jaggareddy: ఈ రోజుల్లో జనాలకు ఆపద వచ్చిందంటే అక్కున చేర్చుకునే రాజకీయ నాయకులు వందల్లో ఒక్కరో ఇద్దరో ఉంటారు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలా ఎన్నికల ముందు చుట్టం చూపులా వచ్చి.. మళ్లీ కంటికి ఎప్పుడు కనబడుతారో తెలియని పరిస్థితి. కేవలం ఓట్ల కోసమే ప్రజల వద్దకు వెళ్లే రాజకీయ నాయకులే దేశంలో ఎక్కువ ఉన్నారు. ఇలాంటి ప్రస్తుత సమాజంలో నేనున్నా అని ముందుకు వచ్చే రాజకీయ నాయకులు చాలా తక్కువ. ఒక్కసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచాక మళ్లీ జనాల వద్దకు వచ్చే రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కనబడే కొందరు బడా నాయకులు మళ్లొచ్చే ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు మాత్రమే ప్రత్యక్షం అవుతుంటారు. ఇలాంటి సమాజంలో ఎక్కడో ఓ చోట మంచి రాజకీయ నాయకులు కనబడుతుంటారు. పేదోళ్లకు ఆపద వచ్చిందంటే వెంటనే ఆదుకునే నాయకులు పదిలో ఒకరు ఉంటారు. అలాంటి రాజకీయ నాయకుల్లో ఒక్కరు మన సంగారెడ్డి మాజీ ఎమ్మల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. తన నియోజకవర్గంలో పేదలకు సమస్య వచ్చిందంటే ఎప్పుడూ ముందుంటారు. గత అసెంట్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ.. ఎప్పుడూ జనాల్లోనే ఉంటున్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో ఓ క్యాన్సర్ బాధితురాలు ఇబ్బందుల్లో ఉందని తెలిసి మానవత్వం చాటుకున్నారు.
రూ.10లక్షల నగదు సాయం చేసిన జగ్గారెడ్డి
సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. సమస్య తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెంటనే బాధితురాలని ఇంటికి వెళ్లి పరామర్శించారు. చికొత్స కోసం జగ్గారెడ్డి బాధితురాలికి రూ.10 లక్షల నగదు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 7లక్షల అప్పులు చేశానని బాధితురాలు చెప్పింది. తన భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని జగ్గారెడ్డితో ఆమని తన ఆవేదనను వెల్లబుచ్చుకుంది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని చెప్పింది.
బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చిన జగ్గారెడ్డి
ఈ సందర్భంగా జగ్గారెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు. తనకు సాయం చేసి, వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు. కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టి కి తీసుకు వచ్చానన్నారు. పేదలకు ఇలాంటి రోగాలు వస్తే.. కనీసం చికిత్స చేయించుకోవడానికి.. పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా..
క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు, ట్రీట్ మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు.
Also Read: Inter Supplementary Schedule: ఇంటర్ ఫెయిల్ అయ్యారా..? అయితే డోంట్‌వర్రీ.. ఇది మీకోసమే..