BigTV English

Nani : అందుకే ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్లతో సినిమాలు చేయట్లేదు

Nani : అందుకే ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్లతో సినిమాలు చేయట్లేదు

Nani : అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మా సినిమాతో నటుడుగా తన ప్రయాణాన్ని మలుచుకున్నాడు. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణంలో అల్లు అర్జున్ కు కూడా ఒక కథను చెప్పాడు. ఇక నటుడుగా బిజీ అయిపోవడం వలన ఆల్మోస్ట్ డైరెక్షన్ కి గుడ్ బాయ్ చెప్పేసాడు. కానీ కొత్త కొత్త డైరెక్టర్లను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలోపడ్డాడు. తాను నటుడుగా డైరెక్టర్ ను పరిచయం చేయడం మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా కొంతమంది దర్శకులను పరిచయం చేయడం మొదలుపెట్టాడు.


అందుకే ఎస్టాబ్లిష్ డైరెక్టర్ తో చేయడం లేదు

ఇక నాని తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాడు. కానీ పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్లతో సినిమాలు చేయలేదు. రాజమౌళి మినహాయిస్తే పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, బోయపాటి శ్రీను, వివి వినాయక్, సురేందర్ రెడ్డి, శ్రీను వైట్ల ఇలాంటి దర్శకులు ఎవరూ కూడా నానితో పని చేయలేదు. ఇక నాని కూడా ఎస్టాబ్లిష్ డైరెక్టర్లతో ఎందుకు పనిచేయట్లేదు అనేదానిని తన మాటల్లో చెప్పుకొచ్చాడు. నేను ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్ తో పనిచేయడానికి ఒప్పుకున్నాను అనుకోండి. వాళ్లు ఒక మూడు నాలుగు నెలల తర్వాత మనం ఈ సినిమా స్టార్ట్ చేద్దామంటారు. ఈ మూడు నాలుగు నెలల్లో నేనొక మూడు సినిమాలకు కమిట్ అయి ఉంటాను. వాళ్లని ఈ మూడు నాలుగు నెలలు వెయిట్ చేయమనడం కరెక్ట్ కాదు కాబట్టి, నేను పెద్దగా ఎస్టాబ్లిష్ డైరెక్టర్ తో పనిచేయట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు.


Also Read : Hari Hara Veera Mallu: ఫస్ట్ పార్ట్ పూర్తి అవ్వలేదు.. అప్పుడే సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

నాని వరుస లైనప్

జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకునే ప్రతి సినిమా కూడా ఎంతో కొంత ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అంటే సుందరానికి ఇలాంటి సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పటికీ ఆ సినిమాకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం నాని శైలెస్ కొలను దర్శకత్వంలో హిట్ 3 అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పారడైజ్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు నాని. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను తీసుకొచ్చి పెట్టింది.

Also Read : Hero Jeeva: కేవలం డబ్బులు కోసమే చేశాను, నాకు అసలు పాలిటిక్స్ కూడా తెలియదు

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×