Inter Supplementary Examination Schedule: తెలంగాణ ఈ రోజు ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫస్టయిర్ ఫలితాల్లో 65.96 శాతం మంది పాసయ్యారు. 34.04 శాతం ఫెయిల్ పర్సంటేజ్ నమోదు అయ్యింది.
ఫస్టయర్ లో 65.65 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు
మొత్తం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,88,430 మంది అభ్యర్థులు అటెండ్ అవ్వగా.. వారిలో 3,22,191 మంది పాసయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 65.65 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. 34.35 ఫెయిల్ పర్సెంటీజ్ నమోదు అయ్యింది. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 5,08,582 మంది అటెండ్ అయితే వాళ్లలో 3 లక్షల 33 వేల 908 మంది అభ్యర్థులు పాస్ అయ్యారు.
సెకండయర్‌లో 65.96 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే మొత్తం ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా.. వారిలో 3,22,191 మంది పాసైయ్యారు. ఇక సెకండియర్ ఫలితాల్లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరైతే వీరిలో 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు.
సప్లమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
ఈ రోజు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మార్కులు పెంచుకోవడం కోసం ఇంప్రూవ్ మెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు కోసం సప్లమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఇంటర్ బోర్డు కల్పించింది. ఈ ఎగ్జామ్స్ మే 22 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోజుకు రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి జూన్ 6వ తేది వరకు జరగనున్నాయి. ఈ ఎగ్జామ్స్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తమ ఇంటర్ కాలేజీల్లో రేపటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని అధికారులు చెప్పారు. ఇతర వివరాలు కో్సం అఫీషియల్ వెబ్ సైట్ లో సందర్శించండి.
Also Read: Group-1 Exam Schedule: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలెర్ట్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
Also Read: CSIR-NAL Recruitment: సువర్ణవకాశం.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.81,000