Memes on Ashish Nehra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇప్పటికే దాదాపు సగం మ్యాచులు పూర్తయ్యాయి. సగం మ్యాచుల్లో… కొన్ని జట్లు బాగా రాణిస్తే మరికొన్ని జట్లు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అంటే ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లు ఏవి అనేవి ఒక క్లారిటీ వచ్చింది. అలాగే ఇంటికి వెళ్లే జట్లు ఏమనేది కూడా… చెప్పవచ్చు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో… గుజరాత్ టైటాన్స్ మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. పడి లేచిన సింహం లాగా ముందుకు వెళ్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మొదటిసారి ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్… ఈసారి గిల్ కెప్టెన్సీలో దుమ్ము లేపుతోంది.
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ దూకుడు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాయింట్లు పట్టికలో దూసుకు వెళ్తోంది గుజరాత్ టైటాన్స్. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు వాడినా గుజరాత్ టైటాన్స్… మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఎనిమిది మ్యాచ్లో 6 మ్యాచులు విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోవడం జరిగింది. 6 మ్యాచ్ లలో విజయం సాధించడంతో.. గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లు దక్కించుకుంది. అటు ప్లస్ రెండు రేట్లో కూడా నిలిచింది గుజరాత్ టైటాన్స్. ఇదే ఊపు కొనసాగిస్తే 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు గెలవడం గ్యారెంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
అదరగొడుతున్న గిల్, సాయి సుదర్శన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో గుజరాత్ ఆటగాళ్లు గిల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరూ దుమ్ము లేపుతున్నారు. ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ అయితే కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తం అతని హవా నడుస్తోంది. వికెట్ అస్సలు ఇవ్వడం లేదు. అతని ఊపు చూస్తుంటే… సాయి సుదర్శన్ కు ఈసారి orange cap వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే లీడింగ్ లో సాయి సుదర్శన్ ఉన్నాడు. ఇదే ఇదే ఊపు మిగిలిన మ్యాచ్లో చూపిస్తే గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ కావడమే కాకుండా అతనికి ఆరెంజ్ క్యాప్ కూడా వస్తుంది. అలాగే టీమిండియాలోకి కూడా సాయి సుదర్శన్ వస్తాడని అంటున్నారు.
ఆశిష్ నెహ్రా సలహాలు
గుజరాత్ టైటాన్స్ కు ఆశిష్ నెహ్రా… సలహాలు బాగా పనికి వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ ఆడినప్పటి నుంచి ఇప్పటివరకు బౌలింగ్ విభాగం మొత్తం ఆశిష్ నెహ్రా ఒక్కడే చూసుకుంటున్నాడు. గుజరాత్ బౌలింగ్ చేస్తున్నంతసేపు బౌండరీ గేటు దగ్గరే నిల్చుంటాడు ఆశిష్ నెహ్రా. అతడు బంతివేడం తప్ప మిగిలిన తతంగం మొత్తం ఆ బౌండరీ గేటు నుంచే చేసేస్తాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు తరచు వైరల్ అవుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే గుజరాత్ ప్లేయర్లను టార్చర్ పెట్టి మరి రిజల్ట్ తీసుకువస్తాడు ఆశిష్ నెహ్రా.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 21, 2025