Jagithyala news : మహా కుంభమేళాకు వెళ్లిన నలుగురు తెలుగు మహిళలు అక్కడ తప్పిపోయారు. వీరంతా జగిత్యాల జిల్లాకు చెందిన మహిళలు కాక.. తప్పిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. త్రివేణి సంగమం దగ్గర జరుగుతున్న మహా కుంభమేళకు రోజూ కోట్ల మంది భక్తజనం హాజరవుతున్నారు. పవిత్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు రోజురోజుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అక్కడ పుణ్యస్థలాల ఘట్ల వద్ద విపరీతంగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కోట్ల మంది భక్తులు వివిధ మార్గాల ద్వారా త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రయాగ్ రాజ్ వెళ్లి వచ్చారు. అయితే.. వీరిలో కొందరు భక్తులు తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మౌనీ అమావాస్య సహా ఇతర ముఖ్యమైన ముహూర్తాల సమయంలో ఘాట్ల దగ్గరకు కోట్ల మంది భక్తులు వస్తున్నారు. ఈ జన సందోహంలో తెలుగు మహిళలు కొందరు తప్పిపోయినట్లుగా గుర్తించారు.
తప్పిపోయిన మహిళలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వీరందరూ 55 సంవత్సరాలు పైబడిన వారై కావటంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. మహిళలు విద్యానగర్ కు చెందిన నరసవ్వ (55) కొత్తవాడకు చెందిన రాజవ్వ (55) కడమ కు చెందిన బుచ్చవ్వ 65 సప్తవ 55 ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీటితోపాటుగా మరి కొంతమంది సైతం తప్పిపోయినట్లుగా సమాచారం.
తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన 11 మంది మహిళలు ఓ బృందంగా ఏర్పడి మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ నెల 29వ తారీఖున మహిళా బృందమంతా కుంభమేళకు చేరుకున్నట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ పుణ్య స్థానాలు ముగించుకుని త్వరలోనే ఇంటికి చేరుకుంటామంటూ తెలియజేసిన కొన్ని గంటలకే మహిళా బృందంలోని నలుగురు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. కోట్లమంది భక్తుల కోలాహలం, రద్దీలో ఆ మహిళలు తప్పిపోయారు.
మామూలు రోజుల్లోనే అక్కడ గుంపుగా ఉండడం వీలు కాదు. అలాంటిది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే చోట ఉండడం వీలు కాని వ్యవహారం. తొపులాటలు, తొక్కిసలాటలు ఎక్కువగా ఉంటుంటాయి. పైగా.. వెళ్లిన వాళ్లు కూడా వయసు మీద పడిన వారు కావడంతో ఆ రద్దీ వేగాన్ని అందుకునే అవకాశం ఉండదు. దీంతో వీరు కలిసి ఒకచోటకి చేరడం వీలయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.
Also Read : జైలుకు విల్లా రాణి.. రూ.300 కోట్ల అక్రమాలు
తప్పిపోయిన మహిళలందరూ ఎక్కువ వయసు ఉన్నవారు కావడం నడిచే అవకాశం లేకపోతే అక్కడ ఎవరిని సంప్రదించాలన్న విషయాలు కూడా తెలియకపోవడంతో వీరి రాకపై ఆందోళన నెలకొంది. అధికారులు తమకు సహాయం చేయాలని అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పిపోయిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.