BigTV English

Jagityala Murder: జగిత్యాలలో యువకుడి హత్య కలకలం..నోట్లో మట్టి కుక్కి..!

Jagityala Murder: జగిత్యాలలో యువకుడి హత్య కలకలం..నోట్లో మట్టి కుక్కి..!

Jagityala Murder: జగిత్యాల జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం చోటుచేసుకుంది. కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఏకంగా నోట్లో మట్టి కుట్టి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్ షిప్ రోజు ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన కందుల రాజశేఖర్ గౌడ్(26) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.


అయితే, మరుసటి రోజు ఉదయం గ్రామ శివారులో ఉన్న బీరయ్య ఆలయం వద్ద శవమై కనిపించాడు. దీంతో హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్నేహితుల రోజు అర్ధరాత్రి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీరప్ప ఆలయం వద్ద కాలిపోయిన శవంతో ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు..శవమై తేలడంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా యువకుడి నోట్లో మట్టి కుట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. యువకుడు అరవకుండా నోట్లో మట్టి కొట్టింటారని, చనిపోయిన తర్వాత అనుమానం రాకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పారిపోయింటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నోట్లో మట్టి కుక్కిన తర్వాత తలపై కర్రతో దాడి చేచి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే చనిపోయిన తర్వాత పెట్రోల్ పోసి అంటించారా? లేదా బతికుండగానే సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారా వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: హైదరాబాద్‌లో మిస్సింగ్..తిరుపతిలో ప్రత్యక్షం

ఇదిలా ఉండగా, స్నేహితుల రోజే యువకుడిని చంపాలని ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే రోజు ఉదయం బయటకు వెళ్లిన రాజశేఖర్ గౌడ్ కాసేపటికే ఇంటికి వచ్చి పడుకున్నాడు. తర్వాత ఓ స్నేహితుడు వచ్చి బయటకు తీసుకెళ్లినట్లు యువకుడి తల్లిదండ్రులు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన యువకుడితోపాటు కొంతమంది మిత్రులే రాజశేఖర్ ను చంపినట్లు మృతుడి తల్లిదండ్రులు రమేష్ గౌడ్, రాధ ఆరోపిస్తున్నారు. హంతుకులను తమకు అప్పగించాలని గ్రామంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

Tags

Related News

Dating App: దారుణం.. డేటింగ్ యాప్‌లో ఓ యువకుడు బట్టలు విప్పి.. చివరకు..?

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Big Stories

×