Jagtial Congress Leader Incident: జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్ నేత హత్య జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, కత్తితో పొడిచి సంతోష్ అనే వ్యక్తిని హత్య చేశారు. కత్తిపోట్లకి గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. గతంలోనే సంతోష్ గురించి పోలీసులకి చెప్పినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గంగారెడ్డి కుటుంబ సభ్యులని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు.
జాబితాపూర్‌లో కాంగ్రెస్ నేత హత్య.. వెనుక రాజకీయ కక్ష్యలే కారణం అని తెలుస్తోంది. అలాగే సంతోష్ అనే వ్యక్తి గంజాయి మత్తులో హత్య చేసినట్లు సమాచారం. సంతోష్ అనే వ్యక్తి గతంలో దసరా పండుగ సందర్బంగా గ్రామంలో ఇష్టమొచ్చినట్టు తీరు వ్యవహరించడంతో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డి సంతోష్‌ని మందలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కక్ష్య పెట్టుకుని సంతోష్ రెడ్డి గంగారెడ్డిని హత్య చేసినట్లు సమాచారం అందుతోంది.
అయితే పలుమార్లు కూడా సంతోష్ రెడ్డిపై పోలీసులకు సమాచారం అందించిన పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు, ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొత్తానికి అయితే కాంగ్రెస్ నేత హత్యకు సంబధించి రాజకీయ కక్ష్య, దీంతో పాటు గ్రామంలో నెలకొన్న విబేధాలే కారణం అని తెలుస్తోంది. సంతోష్ రెడ్డి అనే వ్యక్తిపై దాదాపు 20 కేసుల వరకు ఉన్నాయి. అతనికి ఎస్సైతోను సత్సంబంధాలు ఉన్నాయని గ్రామస్థులు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read: మళ్లీ అదే అంశంపై కేటీఆర్ లొల్లి.. జనం మరిచిపోయారనా?
ఈ నేపథ్యంలో ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నేత దారుణ హత్యపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన తమ్ముడిలాంటి మంచి వ్యక్తిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యమేలుతుందా..? అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా..? బీఆర్ఎస్ ఉందా అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకుల్ని ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా.. లేవా.. అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ జగిత్యాల రహదారిపై నిరసనలు వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమ దందా వల్లనే కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురైనట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.