Ganja Racket Busted: డ్రగ్స్ రహిత నగరమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒడిశా నుంచి నగరానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును చార్మినార్ టాస్క్‌ఫోర్స్, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో రూ. 10.50 లక్షల విలువైన 21 కిలోల ఎండు గంజాయికి స్వాధీనం చేసుకుని, రావాణా చేస్తున్న క్యారియర్‌ను అరెస్ట్ చేశారు.
పాన్ షాప్ ముసుగులో గుట్టుగా వ్యాపారం..
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టుబడిన నిందితుడు షాహీన్‌నగర్‌లో ఓ పాన్ షాప్‌లో సాధారణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు నటిస్తున్నాడు. అయితే, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో గంజాయి దందాలోకి దిగాడు. ప్రధాన నిందితుడు ఇబ్రహీం ఆదేశాల మేరకు ఒడిశాలోని బెర్హంపూర్‌కు వెళ్లి.. అక్కడ సామ్యూల్ అనే వ్యక్తి వద్ద 21 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు.
లగేజీ బ్యాగుల్లో తరలింపు.. బాలాపూర్‌లో నిల్వ
పోలీసుల తనిఖీల్లో దొరకకుండా ఉండేందుకు నిందితుడు సాధారణ ప్రయాణికుడితా ట్రాలీ, లగేజీ బ్యాగులను ఉపయోగించి సరుకును హైదరాబాద్‌కు రహస్యంగా దాచిపెట్టి.. నగరంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశాడు.
ప్రధాన నిందితులు పరారీ.. గాలింపు ముమ్మరం
సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, బాలాపూర్ పోలీసులు నిందితుడి ఇంటిపై మెరుపు దాడి చేసి గంజాయితో పాటు రవాణాకు వాడిన ట్రాలీ, లగేజీ బ్యాగులు, ఒక మెుబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ దందాకు సూత్రధారి అయిన ఇబ్రహీంతో పాటు ఒడిశాకు చెందిన సరఫరాదారు సామ్యూల్ పరారీలో ఉన్నారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Also Read: అత్తతో గొడవ.. 8 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్యాయత్నం