E-Paper
Advertisement

తప్పు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి జూపల్లి

తప్పు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి జూపల్లి
Advertisement

Jupally Krishna Rao: తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు మరోసారి హీట్ పెంచాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నేతలు చెప్పిన లెక్కలనే తాను మాట్లాడానని, ఇందులో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

పాలమూరు పౌరుషమా.. కల్వకుంట్ల పౌరుషమా?

Advertisement

మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇది పాలమూరు పౌరుషమా? కల్వకుంట్ల పౌరుషమా? లేక తన్నీరు పౌరుషమా? తేల్చుకుందాం రండి’ అంటూ కేటీఆర్, హరీశ్‌రావులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల వివరాలపై బహిరంగ చర్చకు తానే స్వయంగా సిద్ధమని ఆయన ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

Advertisement

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై మోపిన అప్పుల భారం గురించి తాను ప్రస్తావించిన అంశాలన్నీ వందకు వంద శాతం నిజాలని జూపల్లి పేర్కొన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పు అని కేటీఆర్ కానీ, హరీశ్‌రావు కానీ నిరూపిస్తే.. తాను తక్షణమే తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే వారు ఏం చేస్తారని ప్రశ్నించారు.

Also Read: టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

అసెంబ్లీ రికార్డుల ఆధారంగానే..

తానేదో గాల్లో లెక్కలు చెప్పడం లేదని, గతంలో కేటీఆర్, హరీశ్‌రావు స్వయంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికలు, చెప్పిన లెక్కల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని జూపల్లి స్పష్టం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన నిలదీశారు. నిజాలు మాట్లాడితే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ సవాల్‌తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి మంత్రి జూపల్లి విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్‌పై కేటీఆర్, హరీశ్‌రావు ఎలా స్పందిస్తారో, ఈ అప్పుల పంచాయితీ ఎటు దారితీస్తుందో చూడాలి.

Related News

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×