BigTV English

KTR vs Jupally Krishna Rao War: కేటీఆర్ కథే వేరు..

KTR vs Jupally Krishna Rao War: కేటీఆర్ కథే వేరు..

అమిత్‌ షా ఫేక్ వీడియో ఎడిట్ చేసింది.. వైరల్ చేసింది.. సీఎం రేవంత్ రెడ్డినా..? ఈ విషయం కేటీఆర్‌ ఎలా కన్ఫామ్ చేశారన్నది కేటీఆరే చెప్పాలి.. ఇక ఓయూ ఫేక్ సర్క్యూలర్ గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ..ఎందుకంటే ఈ కేసులో ఫేక్ సర్క్యూలర్‌ వైరల్‌ చేసిన ఆ పార్టీ నేత క్రిశాంక్‌ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా ఈ ప్రచారాన్ని మాత్రం మానడం లేదు కేటీఆర్ గారు. ఆఖరికి బీఆర్ఎస్‌ నేతలు చూపించిన సర్క్యూలర్‌ ఫేక్‌ అని ఓయూ అనౌన్స్ చేసినా.. ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు.


Also Read:  ఏందమ్మా ఇది.. మద్యం మత్తులో యువతీ హల్ చల్..

అయితే కేటీఆర్ ట్వీట్‌కు కాంగ్రెస్‌ నేతలు కౌంటర్ర ట్వీట్స్‌ షురూ చేశారు. హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను రేవంత్ రెడ్డి గారు సర్క్యూలేట్ చేశారని మీరు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. మీరేమైనా విచారణాధికారా.. లేక అమిత్ షా ఏజెంటా అంటూ రివర్స్‌ అటాక్ మొదలుపెట్టారు. కేటీఆర్‌కు ఏకంగా 9 ప్రశ్నలను సంధించారు కాంగ్రెస్‌ నేత అనిల్ ఈరపత్రి.. ఇదొక్కటే కాదు.. ఈ మధ్య కేటీఆర్ చేసే కొన్ని ఆరోపణలు చాలా చిత్రంగా ఉంటున్నాయి. ఏకంగా హత్యలను కూడా కాంగ్రెస్‌ నేతల మెడకు చుడుతున్నారు ఆయన..

మంత్రి జూపల్లి కృష్ణారావుపై కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలు ఇవి. మరి విపక్షంలో ఉన్న కేటీఆరే ఇలా మాట్లాడితే.. అధికారపక్షంలో.. అందులో మంత్రి అయినా జూపల్లి ఊరుకుంటారా.. అదే స్థాయిలో కౌంటరిచ్చారు.. మరి ఆయన ఏమన్నారో కూడా వినండి.. కౌంటర్లు.. ఎన్‌కౌంటర్లు.. మొత్తానికి డైలాగ్ వార్.. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం దీని చుట్టే తిరుగుతోంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేటీఆర్ ఈ మధ్య డోస్ పెంచేశారు. అయితే ఇవన్నీ ఆరోపణలే.. నిజానికి విపక్షానికి విమర్శలు చేయవచ్చు.. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయవచ్చు.. విపక్షంలో ఉన్న పార్టీకి ఆ హక్కు ఉంటుంది. బట్.. ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల వచ్చేదేంటో అనేది అర్థం కావడం లేదు.

మొత్తానికి కేటీఆర్ తీరు చూస్తుంటే ప్రజల్లో ఒక ఒపినీయర్ క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పదే పదే ఒకే విషయాన్ని చెప్పడం.. ట్వీట్ చేయడం చేస్తున్నారు ఆయన.. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్.. సో.. స్లోగా ప్రజల్లో ప్రస్తుత సర్కార్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై ఒక ఒపినీయన్ క్రియేట్ చేయడం దీని వెనకున్న వ్యూహాంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ ప్రజలు.. మరి అంత అమాయకులు కాదు కదా..

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×