E-Paper
Advertisement

Kavitha: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్ళీ బిగ్ జీరో.. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కిందేంటి?

Kavitha: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్ళీ బిగ్ జీరో.. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కిందేంటి?
Advertisement

Kavitha: కేంద్ర బడ్జెట్ 2026 పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం చెబుతున్న స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అనే నినాదాల వెనుక ఉన్న అసలు వాస్తవం తెలంగాణ పట్ల వివక్షేనని ఆమె ఆరోపించారు. వరుసగా 12వ సారి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు “పెద్ద సున్నా” మిగిలిందని ఆమె విమర్శించారు.

రూ. 34,367 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, మరియు రేడియల్ రోడ్ల నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణలో కేంద్రం అందించాల్సిన 50% వాటా నిధులు ఇంకా మంజూరు కాలేదని విమర్శించారు.కొత్త రైల్వే లైన్లకు క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని అటకెక్కించారని ఆరోపించారు.

Advertisement

తెలంగాణకు దక్కాల్సిన ఐఐఎం (IIM Hyderabad), 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం తిరస్కరించిందని మండిపడ్డారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి వాటిని పట్టించుకోవడం లేదని, పారిశ్రామిక ప్రోత్సాహకాలు శూన్యమని పేర్కొన్నారు.

తెలంగాణ నుండి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే, తిరిగి రాష్ట్రానికి నిధులు కాకుండా కేవలం పెండింగ్ ఫైళ్లు మాత్రమే వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇది సహకార ఫెడరలిజం కాదు, రాష్ట్ర ప్రయోజనాలను వెనక్కి నెట్టడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

అయితే ఈ బ‌డ్జెట్ పై బీజేపీ నేత‌లు సానుకూలంగా స్పందిస్తున్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నిధులు, పన్నుల రూపంలో వచ్చే కేటాయింపులు యథావిధిగా అందుతాయని, హై-స్పీడ్ రైల్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మారుస్తాయని చెబుతున్నారు.

కాగా, కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు సంబంధించి పలు కీలక మౌలిక సదుపాయాల ప్రకటనలు వెలువడ్డాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లలో పూణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా (Hub) గుర్తించింది కేంద్రం. వీటితో పాటు, నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా మార్చే ‘సిటీ ఎకనామిక్ రీజియన్స్’ (CER) పథకంలో భాగంగా ఎంపిక చేసిన నగరాలకు ఐదేళ్ల కాలానికి ₹5,000 కోట్లు కేటాయించనుండగా, హైదరాబాద్ ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాల సమీపంలో ఏర్పాటు చేయనున్న 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లలో ఒకటి తెలంగాణకు దక్కే అవకాశం ఉండగా, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే 5 రీజినల్ మెడికల్ హబ్‌లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.

Read Also: Union Budget 2026: గ్రీన్ ఎనర్జీకి బడ్జెట్ బూస్ట్.. 4000 ఈ-బస్సులు, పర్యాటకానికి పెద్దపీట!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×