BigTV English

K.Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుముూత

K.Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుముూత

K.Viswanath : టాలీవుడ్ లో మరో విషాదం. దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాతపస్వి మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ శోకచంద్రంలో మునిపోయింది.


పలుపురు సినీ, రాజకీయ ప్రముఖులు కె.విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి సామాన్యమైన కథలను తన ప్రతిభతో.. వెండితెర దృశ్యకావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. గతంలో కె.విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చ జరిగిందని తెలిపారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో విశ్వనాథ్‌ పెద్ద పీట వేశారని కొనియాడారు. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

విశ్వనాథ్‌ మరణం తనను తీవ్ర విచారానికి గురిచేసిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌ అని కొనియాడారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని సీఎం జగన్‌ కొనియాడారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీనటులు చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ సంతాపం ప్రకటించారు.


కె. విశ్వనాథ్ 5దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమకు సేవలు అందించారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్‌ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు.

1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాతో సినిమా ప్రస్థానాన్ని కె. విశ్వనాథ్ ప్రారంభించారు. ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలను తెరకెక్కించారు. నటుడిగానూ కె. విశ్వనాథ్ మెప్పించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి సినిమాలు ఆయన ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి. ఎన్నో అవార్డులు, పురస్కారాలు కళాతపస్వి ్ందుకున్నారు.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×