BigTV English

Kaleshwaram Project: కాళేశ్వరం కమీషన్లు.. అందరికీ ముడుపులు, రేపో మాపో నోటీసులు

Kaleshwaram Project: కాళేశ్వరం కమీషన్లు.. అందరికీ ముడుపులు, రేపో మాపో నోటీసులు

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఎంతవరకు వచ్చింది? భారీ అవకతవకలను కమిషన్ గుర్తించిందా? కాలేశ్వరం ‘కమీషన్ల’ ప్రాజెక్టుగా మారిపో యిందా? ప్రాథమికంగా జ్యుడీషియల్ కమిషన్ ఏయే అంశాలను నిర్ధారించింది? ఇంజనీర్ల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరూ కుమ్మక్కు అయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. కాలేశ్వరం ప్రాజెక్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. రేపో మాపో కమిషన్ వీరికి నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. వారికి వ్యతిరేకంగా బలమైన సాక్షాధారాలను సిద్ధం చేసింది. ఇప్పటివరకే సేకరించిన ఆధారాలతో మాజీలను విచారించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

కేవలం పైసలు కోసం నిబంధనలకు తిలోధకాలు ఇచ్చినట్టు అంచనాకు వచ్చింది. ముఖ్యంగా రూల్స్ బ్రేక్ చేసి మరీ, అప్పట్లో అధికారులు ఆనాటి ప్రభుత్వ పెద్దలకు అన్నివిధాలుగా సహకరించినట్టు గుర్తించింది. ఈ ప్రాజెక్టుపై కాగ్ లేవనెత్తిన అంశాలు, విజిలెన్స్ రిపోర్టు, అఫిడవిట్లు వంటి నివేదికలను జ్యుడీషియల్ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.


ఇప్పటివరకు బ్యారేజీలు, పంప్ హౌస్‌ల నిర్మాణం, సివిల్ వర్క్స్ వరకు పరిమితమైన అవినీతి, చివరకు విదేశాల నుంచి తెచ్చిన మోటార్ల కోనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించింది కమిషన్. కాళేశ్వరంపై విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్, ఆసక్తికర విషయాలు బయటకు తీసినట్టు సమాచారం.

ALSO READ:  దావోస్‌లో రేవంత్ టీమ్.. మా ప్రయార్టీ-లక్ష్యాలు, తామే ఫస్ట్

కాళేశ్వరం కమీషన్ల ప్రాజెక్టుగా మారిపోయినట్టు తెలుస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు ఏజెన్సీలు ముడుపులు ముట్ట జెప్పినట్టు ప్రభుత్వ వర్గాల మాట. ఈ క్రమంలో ప్రాజెక్టు అంచనాలను అమాంతంగా పెంచేశారు. ప్రాథమికంగా కొన్ని అంశాలను జ్యుడీషియల్ కమిషన్ నిర్థారించినట్టు అంతర్గత సమాచారం. 204 పేజీలతో ప్రాథమిక రిపోర్టు ఘోష్ కమిషన్ రెడీ చేసింది. మార్చిలోగా తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

మంగళవారం నుంచి కాలేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. అప్పటి ఫైనాన్స్ స్పెషల్ సీఎస్, ఇతర ఆర్థిక శాఖ అధికారులను మళ్లీ ప్రశ్నించనుంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాల సమీకరణ కోసం అనుమతుల జారీలో ఆర్థికశాఖ కీలకపాత్ర పోషించింది. కార్పొరేషన్‌కు లేని ఆదాయాన్ని ఉన్నట్లు చూపించి రుణాలు సేకరించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో అధికారులతోపాటు అప్పటి బీఆర్ఎస్ నేత ప్రకాష్ తోపాటు బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను రెండురోజుల్లో విచారించనుంది. మొత్తానికి కాలేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ పార్టీ కొంప కొల్లేరు చేయడం ఖాయమనే వాదన అప్పుడే నేతల్లో బలంగా వినిపిస్తోంది.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×